Rahul in Warangal: అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ: ప్రకటించిన రాహుల్ గాంధీ

ఈసందర్భంగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలను, రైతులను టీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని..భాజపాతో పెట్టుకున్న టీఆర్ఎస్..ఆపార్టీకి రిమోట్ కంట్రోల్ గా మారిందని రాహుల్ విమర్శించారు

Rahul in Warangal: అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ: ప్రకటించిన రాహుల్ గాంధీ

Rahul

Rahul in Warangal: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముమ్మర కసరత్తు చేస్తుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. శుక్రవారం వరంగల్ లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈసందర్భంగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలను, రైతులను టీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని..భాజపాతో పెట్టుకున్న టీఆర్ఎస్..ఆపార్టీకి రిమోట్ కంట్రోల్ గా మారిందని రాహుల్ విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి అడ్డగోలుగా దోచుకుతింటున్నా..ఆయనపై కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ సంస్థలతో ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

Also Read:Weather Alert: తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు, రేపు మోస్తరు వర్షాలు

ఎందరో వ్యక్తులు తెలంగాణ కోసం పోరాడి ప్రాణ త్యాగం చేసారని..ఒక వ్యక్తికో, కుటుంబం కోసమో తెలంగాణ ఇవ్వలేదని..తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు ప్రత్యేక రాష్ట్రం ప్రకటించినట్లు రాహుల్ వివరించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగంగా ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఎక్కడికి రమన్నా వస్తానన్న రాహుల్ గాంధీ..రాష్ట్రానికి ఏ విధమైన సహాయం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తెలంగాణకు రైతులు పునాది లాంటి వారన్న రాహుల్..రైతులే ఆగం అయితే రాష్ట్రం అధోగతి పాలవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చత్తీశ్గఢ్ లో లాగానే రానున్న రోజుల్లో తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తామని రాహుల్ ప్రకటించారు.

Also Read:Rahul Gandhi : సోనియా కృషివల్లే తెలంగాణ.. అధికారంలోకి వస్తే హామీలన్నీ నెరవేరుస్తాం : రాహుల్

వరంగల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారంటీ అని రాహుల్ పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయడంతో సహా పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.15000 ఇస్తామని ఇది కాంగ్రెస్ గ్యారంటీ అని రాహుల్ ప్రకటించారు. ధరణి పోర్టల్ ఎత్తివేయడంతో పాటు..అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే..తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని రాహుల్ గాంధీ అన్నారు.