Property Dispute: ఆస్తి గొడవలు.. మామను చెప్పుతో కొట్టిన కోడలు

అందరూ చూస్తుండగానే మామను చెప్పుతో కొట్టింది కోడలు. ఆస్తి వివాదం కాస్త హద్దులు దాటి రోడ్ మీదకు వచ్చి బహిరంగంగా చెప్పులతో, పిడిగుద్దులతో కొట్టుకునేంత వరకూ వెళ్లింది. ఉత్తరప్రదేశ్ లోని ఘాజిపూర్ లో ఈ ఘటన జరింది. హైవే మీదకు ముసలాయనను ఈడ్చుకుంటూ వెళ్లి కొట్టారు.

Property Dispute: ఆస్తి గొడవలు.. మామను చెప్పుతో కొట్టిన కోడలు

Property Dispute

Updated On : August 10, 2022 / 10:31 AM IST

 

 

Property Dispute: అందరూ చూస్తుండగానే మామను చెప్పుతో కొట్టింది కోడలు. ఆస్తి వివాదం కాస్త హద్దులు దాటి రోడ్ మీదకు వచ్చి బహిరంగంగా చెప్పులతో, పిడిగుద్దులతో కొట్టుకునేంత వరకూ వెళ్లింది. ఉత్తరప్రదేశ్ లోని ఘాజిపూర్ లో ఈ ఘటన జరింది. హైవే మీదకు ముసలాయనను ఈడ్చుకుంటూ వెళ్లి కొట్టారు.

ఈ ఘటన మొత్తం పోలీస్ చౌకీ వద్దనే జరగడం గమనార్హం.

ఆ వీడియోలో.. నా సోదరిని ఎందుకు కొట్టావంటూ ఓ వ్యక్తి రిపీటెడ్ గా అడుగుతుండటం వినిపిస్తూనే ఉంది. ఇక తనని వదిలేయాలంటూ వృద్ధుడ్ని వేడుకుంటున్నప్పటికీ ఏ మాత్రం జాలి చూపించకుండా దాడి చేస్తూనే ఉన్నారు. వీడియో వైరల్ అయి పోలీసుల దృష్టికి వెళ్లింది.

Read Also : ఆస్తి వివాదాలతో ఇద్దరు మహిళల దారుణ హత్య

ఆ మహిళను ఆమె తండ్రిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. మహిళ సోదరుడి కోసం వెదుకుతున్నారు. గాయాలకు గురైన సుఖ్‌దేవ్ సింగ్ యాదవ్ అనే వృద్ధుడ్ని హాస్పిటల్ కు తరలించారు. అతని చిన్న కొడుకైన బబ్లూ యాదవ్ మాట్లాడుతూ.. తన తమ్ముడు సంవత్సరం క్రితం చనిపోయాడని.. తమ్ముడి భార్య, ఆమె సోదరుడు రామ్ విలాస్ తన తండ్రి పేరిట ఉన్న ఆస్తి మొత్తాన్ని బదిలీ చేయాలని ఒత్తిడి చేశారట.

కోడలు ఆస్తి విడగొట్టాలని అడిగింది. కావాలంటే ఒకగదిలో ఉండొచ్చని చెప్పినా ఆమె వినలేదు. తన కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి దాడికి దిగిందంటూ ఆరోపించింది.