Paan Dosa Viral : ‘పాన్ దోస’ అట.. విచిత్రమైన కాంబినేషన్‌పై గరం అవుతున్న నెటిజన్లు

ఇటీవల కాలంలో వైరల్ అవ్వడానికే కొన్ని ఫుడ్ కాంబినేషన్లు తయారు చేస్తున్నారనే డౌట్ వస్తోంది. చిత్ర, విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్ వీడియోలతో కొందరు జనాలకు షాక్ ఇస్తున్నారు. రీసెంట్‌గా 'పాన్ దోస' వీడియో వైరల్ అవుతోంది.

Paan Dosa Viral : ‘పాన్ దోస’ అట.. విచిత్రమైన కాంబినేషన్‌పై గరం అవుతున్న నెటిజన్లు

Paan Dosa Viral

Updated On : June 3, 2023 / 5:48 PM IST

viral Video : ఇంటర్నెట్‌లో రకరకాల ఫుడ్ కాంబినేషన్‌లు వైరల్ అవుతున్నాయి. కొన్ని కాంబినేషన్లు నిజంగా భయపెడుతున్నాయి. తాజాగా పాన్ దోస తయారు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన జనం తయారు చేసిన వ్యక్తిపై మండిపడుతున్నారు.

Paan Burger : ‘పాన్ బర్గర్ అంట’.. కొత్త కాంబినేషన్ చూసి మండిపడుతున్న ఫుడ్ లవర్స్

ఇండియన్స్ ఎంతో ఇష్టపడే వాటిలో దోస ఒకటి. క్రిస్పీగా, కరకరలాడేలా ఉంటే మరింతగా ఇష్టపడతారు. మసాలా దోస, ఉప్మా దోస, రవ్వ దోస ఇలా వెరైటీల గురించి అందరికీ తెలుసు కానీ.. ఇప్పుడు ‘పాన్ దోస’ వైరల్ అవుతోంది. ఈ విచిత్రమైన కాంబినేషన్ ఏంటని? భయపడుతున్నారు కదూ.. @happyfeet_286 అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి పాన్ దోసను తయారు చేశాడు. ఫ్లోరో సెంట్ గ్రీన్ కలర్ డిష్ ఇంటర్నెట్‌ను షాక్‌కి గురి చేసింది.

 

ఓ వ్యక్తి తమలపాకులు యాడ్ చేసిన ఆకుపచ్చని రంగు పిండిని వేడిగా ఉన్న తవాపై పోశాడు. కొన్ని సెకండ్ల తర్వాత దానిపై వెన్న రాశాడు. తరువాత తరిగిన పాన్, చెర్రీస్, ఎండు ద్రాక్ష, ఆప్రికాట్లు, ఖర్జూరాలు, అత్తి పండ్లు, టూటీ ఫ్రూటీ మరియూ డ్రై ఫ్రూట్లు ఇవన్నీ కలిపిన పేస్ట్‌ను దోసపై వేశాడు. అవన్నీ దోసపై కలిసేలా దోసను తయారు చేశాడు. ఈ దోస చూసేవారిని షాక్‌కి గురి చేసింది. ఈ విచిత్రమైన కాంబినేషన్ అవసరమా? అని జనం మండిపడుతున్నారు. ఈ వీడియో షేర్ చేసిన వ్యక్తి ‘ఈ గ్రహాన్ని వదిలిపెట్టి వెళ్లే సమయం ఆసన్నమైంది’ అనే శీర్షికతో పోస్టు చేసారు. ఇక నెటిజన్లు వరుసగా కామెంట్లు పెట్టారు.

mango pani puri : మ్యాంగో- పానీ పూరీ కొత్త కాంబినేషన్.. మండిపడుతున్న పానీ పూరీ లవర్స్

‘ఈ వీడియో రెండవ పార్ట్ చూడాలి.. ఆ తర్వాత నా ట్విట్టర్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేస్తాను’ అని ఒకరు.. ‘1 శాతం మాత్రమే పాన్.. మిగతా 99 శాతం ఫుడ్ కలరింగ్’ అంటూ మరొకరు వరుసగా కామెంట్స్ చేశారు. ఇంతకీ ఈ పాన్‌ని ఎవరైనా తిన్నారో లేదో మాత్రం వీడియోలో చూపించలేదు.