Pawan Kalyan: ఇండియాలో పవర్‌స్టార్ ఒక్కరే.. నన్నలా పిలవొద్దు..

ఇండియాలో పవర్‌స్టార్ అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే - పునీత్ రాజ్‌కుమార్..

Pawan Kalyan: ఇండియాలో పవర్‌స్టార్ ఒక్కరే.. నన్నలా పిలవొద్దు..

Pawan Kalyan

Updated On : June 19, 2021 / 4:46 PM IST

Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటే ఫ్యాన్స్ పూనకాలొస్తాయి.. తమ ఫేవరెట్ యాక్టర్ సినిమా రిలీజ్ అంటే భారీ కటౌట్స్ లేస్తాయ్.. ఆయన పోస్టర్ కనిపిస్తే చాలు, థియేటర్ బయట హౌస్‌ఫుల్ బోర్డ్స్ కనిపిస్తాయ్..

పవర్‌స్టార్ బాక్సాఫీస్ స్టామినా గురించి, ఆడియెన్స్‌లో ఆయనకున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలోనూ పవన్‌కు అభిమానులు, వీరాభిమానులు, నితిన్‌లాంటి భక్తులు చాలామందే ఉన్నారు. ఇప్పుడు ఒక స్టార్ హీరో.. ‘ఇండియాలో పవర్‌స్టార్ ఒక్కరే’.. ‘ఇకపై నన్ను పవర్ స్టార్ అని పిలవకండి. పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ సారే’ అంటూ ఓ స్టార్ హీరో చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్‌లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అయితే శాండల్‌వుడ్‌లో పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్.. కన్నడ కంఠీరవ, స్వర్గీయ రాజ్‌కుమార్ మూడో కొడుకు, సీనియర్ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ తమ్ముడే పునీత్. అతనికి కన్నడనాట ఉన్న క్రేజ్ వేరే. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది.

అటువంటి పునీత్ రాజ్ కుమార్.. లేటెస్ట్‌గా ఓ ఇంటర్వూలో తనను పవర్‌స్టార్ అని పిలవొద్దని, ఇండియాలో పవర్‌స్టార్ అంటే పవన్ కళ్యాణ్ మాత్రమేనంటూ చెప్పుకొచ్చారు. టాలీవుడ్ పవర్‌స్టార్‌ గురించి, శాండల్‌వుడ్ పవర్‌స్టార్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే గతంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తమిళనాడులో తన సినిమాలకు సూపర్ స్టార్ ట్యాగ్ వెయ్యను అంటూ చెప్పారు. సూపర్ స్టార్ అంటే రజినీకాంత్ మాత్రమే అని సూపర్ స్టార్ బిరుదు వద్దంటూ చెప్పారు.