Pawan Kalyan : సీమ స్లాంగ్‌లో పవర్‌స్టార్ పవర్‌ఫుల్ డైలాగ్స్.. సాయమందిస్తున్న పెంచల్ దాస్..

మూడేళ్ల విరామం తర్వాత అభిమానుల ఆకలి తీర్చడంతో పాటు బాక్సాఫీస్ వద్ద ‘వకీల్ సాబ్’ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారాయన. పవన్, రానా దగ్గుబాటిల క్రేజీ కలయికలో మలయాళంలో అద్భుత విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే..

Pawan Kalyan : సీమ స్లాంగ్‌లో పవర్‌స్టార్ పవర్‌ఫుల్ డైలాగ్స్.. సాయమందిస్తున్న పెంచల్ దాస్..

Pawan Kalyan

Updated On : April 16, 2021 / 12:35 PM IST

Pawan Kalyan: మూడేళ్ల విరామం తర్వాత అభిమానుల ఆకలి తీర్చడంతో పాటు బాక్సాఫీస్ వద్ద ‘వకీల్ సాబ్’ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారాయన. పవన్, రానా దగ్గుబాటిల క్రేజీ కలయికలో మలయాళంలో అద్భుత విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Pawan - Rana

పవన్, బిజూ మీనన్ క్యారెక్టర్ చేస్తుండగా.. రానా, పృథ్వీ రాజ్ పాత్రలో కనిపించనున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

Pawan - Rana

పవన్ చేస్తున్న పోలీస్ పాత్రకు రాయలసీమ నేపథ్యాన్ని జత చేశారు. సినిమాలో రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పడానికి పెంచల్ దాస్, పవన్‌కి హెల్స్ చేస్తున్నారు. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’, ‘అరవింద సమేత’, ‘శ్రీకారం’ సినిమాలలో సీమ యాస అంత బాగా రావడంలో పెంచల్ దాస్ పాత్ర చాలా కీలకమైనది. దాంతో పాటు పాటలు రాయడం, పాడడంతోనూ మంచి గుర్తింపు పొందారాయన.
ఈ సినిమాలో పవన్ రాయలసీమ యాసలో అద్భుతంగా డైలాగ్స్ చెబుతున్నారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. త్వరలో మరిన్ని వివరాలు తెలియచేయనున్నారు. ఈ సినిమాకి సమర్పణ : పిడివి ప్రసాద్, సంగీతం : థమన్, కెమెరా : ప్రసాద్ మూరెళ్ల, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : ఏఎస్ ప్రకాష్, నిర్మాత : సూర్యదేవర నాగ వంశీ.