mango pani puri : మ్యాంగో- పానీ పూరీ కొత్త కాంబినేషన్.. మండిపడుతున్న పానీ పూరీ లవర్స్
ఇటు పానీ పూరీ లవర్స్‌ని.. అటు మ్యాంగో లవర్స్‌ని భయపెడుతోంది 'మ్యాంగో పానీ పూరీ'.. ఇదేం రకం అనుకుంటున్నారా? కొత్త రకం కాంబినేషన్. దీన్ని చూసి జనం షాకవుతున్నారు.

mango pani puri
mango pani puri : పానీ పూరీ అంటే ఇష్టపడని వారు అరుదుగా ఉంటారు. ప్రతి వీధిలో వీటిని అమ్మే వ్యాపారులు కనిపిస్తారు. ఇప్పుడు కొత్త రకం కాంబినేషన్ల హవా నడుస్తోంది కదా.. ఓ పానీ పూరి వ్యాపారికి కూడా ఐడియా వచ్చింది. ‘మ్యాంగో పానీ పూరీ’ అమ్మేస్తున్నాడు. వామ్మో ఇదేం కాంబినేషన్ అనుకుంటున్నారా? ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ పానీ పూరి కాంబినేషన్ చూసి జనం చిరాకు పడుతున్నారు.
Aadhaar To Eat Golgappa : ఆధార్ కార్డు చూపిస్తేనే పానీ పూరి..! వ్యాపారి వింత రూల్..!!
వేసవి కాలంలో మామిడి పండ్లు విరివిగా దొరుకుతున్నాయి. ఇక ఆల్రెడీ హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న పిల్లలు పానీ పూరీలు అంటే పిచ్చి ఇష్టంగా తింటారు. వాటివల్ల హాని జరిగే ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తున్నా ఇంట్లో వాళ్లు ఆపలేని పరిస్థితి. ఇక ఈ రెండింటిని కలిపిన కాంబినేషన్ వస్తే. అదేనండీ ‘మ్యాంగో పానీ’ పూరీ .. తాజాగా ఓ వ్యాపిరి మ్యాంగో పానీపూరీని అమ్ముతున్నాడు. @bombayfoodie_tales అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ దీనికి సంబంధించిన వీడియోని షేర్ చేసాడు. అంతే జనాలు షాకయ్యారు. ఒక ప్లేట్ లోకి పూరీలను తీసుకుని దానికి చోలె మిక్స్‌ని కలిపాడు. ఆ తరువాత తీసి పెట్టుకున్న మామిడికాయ జ్యూస్ దానిపై పోసాడు ఆ వ్యాపారి. ఇలా మ్యాంగో పానీపూరీని అందరికీ అందిస్తున్నాడు. ఈ కాంబినేషన్ తినడం అనేది ఎంతవరకూ సేఫ్ తెలియదు.. ఇక తిన్నవాళ్ల సంగతి కూడా ఏమో కానీ ఇంటర్నెట్ లో ఈ వీడియో వైరల్ అవుతోంది.
Elephant Eating Panipuri: పానీపూరిని తెగ లాగించేసిన ఏనుగు.. వీడియో వైరల్.. ఫిదా అవుతున్న నెటిజన్లు
‘ఇలాంటి కాంబినేషన్లు ఆరోగ్యానికి హానికరం.. తిండితో ఆటలు వద్దు’.. అంటూ యూజర్లు అభిప్రాయపడుతున్నారు. కొన్ని ఆహారపదార్ధాలు కలయిక వల్ల పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారం పెంచుకునేందుకు అమ్మకం దారులు కొత్త కొత్త కాంబినేషన్లతో జనం ముందుకు వస్తారు.. అయితే ఈ కాంబినేషన్లు ఎంతవరకూ సేఫ్ అనేది తినే ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి.
View this post on Instagram