Covid Dead Body: మృతదేహాన్ని నదిలో విసిరేసిన వ్యక్తులు.. వీడియో వైరల్!

గత ఏడాది తొలిదశలో అసలు కరోనా సోకితే చాలు ఆ వ్యక్తికి నయమై తిరిగివస్తే తప్ప చనిపోయినా కనీసం బంధువులు వెళ్ళేది కాదు.. ఆసుపత్రులు, అధికారులు కూడా బాడీలను తిరిగే ఇచ్చే పరిస్థితి లేదు.

Covid Dead Body: మృతదేహాన్ని నదిలో విసిరేసిన వ్యక్తులు.. వీడియో వైరల్!

Covid Dead Body

Updated On : May 30, 2021 / 7:34 PM IST

Covid Dead Body: గత ఏడాది తొలిదశలో అసలు కరోనా సోకితే చాలు ఆ వ్యక్తికి నయమై తిరిగివస్తే తప్ప చనిపోయినా కనీసం బంధువులు వెళ్ళేది కాదు.. ఆసుపత్రులు, అధికారులు కూడా బాడీలను తిరిగే ఇచ్చే పరిస్థితి లేదు. కానీ.. సెకండ్ వేవ్ లో ఆసుపత్రులలో కూడా శవాల గుట్టలతో అధికారులకు అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. శ్మశానాలు కూడా హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేయడంతో మృతదేహాలను కుటుంబ సభ్యులకు ఇచ్చేస్తూ వచ్చారు. ఇప్పుడు డెడ్ బాడీల వద్ద కాస్త క్రౌడ్ తగ్గినా ఆసుపత్రులలో మృతదేహాలను శానిటైజ్ చేసి కుటుంబాలకు ఇస్తున్నారు.

తమ మనిషిని అనాధలా వదిలేయడం ఇష్టం లేక కొంతమంది.. మృతదేహాన్ని ఇచ్చేసే ప్రైవేట్ ఆసుపత్రులతో కొందరు డెడ్ బాడీలను తీసుకొస్తున్నారు. కానీ దహనసంస్కారాలు, కర్మకాండలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కుటుంబ సభ్యులే నానాయాతన పడుతున్నారు. దహనసంస్కారాలు చేసేందుకు కూడా శ్మశానాల వద్ద భారీగా ముట్టజెప్పాల్సివస్తుంది. ఈక్రమంలోనే కొందరు నదులలో మృతదేహాలను విసిరేస్తున్నారు. అలానే ఈ మధ్య కాలంలో గంగా, యమునా నదులలో వందలకొద్దీ కరోనా మృతదేహాలు తేలియాడుతూ కనిపించాయి.

కాగా.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఓ నదిలో అలానే కరోనా మృతదేహాన్ని విసిరేస్తున్న ఓ షాకింగ్ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. పీపీఈ కిట్ వేసుకున్న ఓ వ్య‌క్తి మరో వ్యక్తితో కలిసి కొవిడ్‌తో చ‌నిపోయిన వ్య‌క్తి మృత‌దేహాన్ని బ్రిడ్జిపై నుంచి న‌దిలోకి ప‌డేస్తున్న వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారిపోయింది. ఈ నెల 28న జరిగిన ఈ ఘ‌ట‌న‌ను ఆ స‌మ‌యంలో బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న వ్య‌క్తులు వీడియో తీశారు. పట్టపగలు బిడ్జిపై వాహనాలు తిరుగుతుండగానే ఇలా మృతదేహాన్ని విసిరేయడం స్థానికంగా కలకలం రేపగా అధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు.

నదిలో విసిరింది కరోనా రోగి మృత‌దేహ‌మేన‌ని ఇప్పటికే బ‌ల్‌రామ్‌పూర్ చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ బీబీ సింగ్‌ చెప్పగా.. ఓ వ్యక్తి కరోనాతో మే 25న ఆస్పత్రిలో చేరగా 28న మరణించడంతో కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారమే బంధువులకు మృతదేహాన్ని అప్పగించామని.. అయితే వారు ఖననం చేయకుండా ఇలా విసిరేయడంపై ఇప్ప‌టికే బంధువుల‌పై కేసు న‌మోదు చేశామని తెలిపారు. వాళ్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కాగా.. నదుల్లో మృతదేహాలను విసిరేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన రెండు రోజులలోనే ఈ వీడియో బయటకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.