PK Creative Works: పవన్ ఏంటి.. ఇంత సీరియస్ గా తీసుకున్నాడు?

సినిమాను వదిలి ప్రజా సేవకు దిగి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారిన పవన్ వరస సినిమాలను ఒకే చేసి హీరోగా మునుపటిని మించిన క్రేజ్ సంపాదించుకోవాలని చూడడం ఒక ఎత్తైతే.. ఇప్పుడు తన బ్యానర్ లో ఇలా ఏకంగా డజన్ల కొద్ది సినిమాలను ప్రకటించడం మరింత ఇంట్రెస్టింగ్ మారింది.

PK Creative Works: పవన్ ఏంటి.. ఇంత సీరియస్ గా తీసుకున్నాడు?

Pawan

Updated On : April 3, 2021 / 4:19 PM IST

PK Creative Works: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు గురించి.. సినీ వినీలాకాశంలో ఈ పేరుకున్న బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. పవర్ స్టార్ సినిమా వస్తుంటే.. అభిమానులకు పూనకం వస్తుందంటే నమ్మితీరాల్సిందే. హిట్టా.. ఫట్టా అన్నది పక్కనబెడితే ఆ క్రేజ్ కే రికార్డు కలెక్షన్లు వస్తాయన్నది కూడా ఇప్పటికీ ప్రూవ్ అయిపోయిన విషయమే. అయితే.. పవన్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత సినిమాలకు దూరమవుతానని చెప్పారు. కానీ పరిస్థితులు ఏవైనా పవన్ సినిమాలకు దూరం కావడం పక్కనపెట్టి మళ్ళీ పూర్తిస్థాయిలో కథానాయకుడిగా వరస సినిమాలకు సైన్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పవన్ నటించిన వ‌కీల్ సాబ్ పూర్తి కాగా.. హ‌రిహ‌ర వీర మ‌ల్లుతో పాటు అయ్య‌ప్ప‌నుం కోషీయుం రీమేక్‌లో స‌మాంత‌రంగా నటిస్తున్నాడు‌. ఆ తర్వాత హ‌రీష్ శంక‌ర్, సురేంద‌ర్ రెడ్డిల సినిమాలు కూడా లైన్లో పెట్టాడు. ప‌వ‌న్ కోసం మ‌రికొంద‌రు ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఎదురు చూస్తుండగా కథా చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగానే పవన్ నిర్మాణ భాగస్వామ్యంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 సినిమాలు రానున్నాయనే వార్త రావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో ఆసక్తి మొదలైంది.

ఇండస్ట్రీలో ఒక్క అవకాశం వస్తే తామేంటో నిరూపించుకోవాలని కలలు కంటున్న టాలెంటెడ్ పీపుల్‌కు పవన్.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా ఒక వేదిక ఇవ్వనున్నాడు. దీని ద్వారా కొత్త కథలతో దాదాపు 15 సినిమాలకు నిర్మించనున్నట్టు ప్రకటించగా ఈ సినిమాలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌లో తెరకెక్కనున్నాయి. ఈ 15 సినిమాలు కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో నిర్మించనున్నారని ప్రకటించారు. అంటే దేశవ్యాప్తంగా టాలెంట్ ఉన్న వాళ్లకి ఇది వేదిక కానుంది. ఇందులో 6 చిన్న సినిమాలు.. 6 మీడియం రేంజ్,‌ రెండు భారీ సినిమాలు ఉండబోతున్నాయి.

అయితే.. అసలు సినిమాను వదిలి ప్రజా సేవకు దిగి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారిన పవన్ వరస సినిమాలను ఒకే చేసి హీరోగా మునుపటిని మించిన క్రేజ్ సంపాదించుకోవాలని చూడడం ఒక ఎత్తైతే.. ఇప్పుడు తన బ్యానర్ లో ఇలా ఏకంగా డజన్ల కొద్ది సినిమాలను ప్రకటించడం మరింత ఇంట్రెస్టింగ్ మారింది. పవన్ సినిమా నిర్మాణాన్ని ఇంత సీరియస్ గా తీసుకోవడంపై ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. రాజకీయ ప్రయాణమంటే డబ్బుతో కూడిన వ్యవహారమని పవన్ పలుమార్లు చెప్తుంటారు. మరి అందుకే తనకు తెలిసిన సినిమాతో.. తన క్రేజ్ తోనే తనకు కావాల్సిన ఆర్ధిక అండను వెతుక్కున్నారా? సహజంగా టాలెంట్ ఉన్నవారికి ఆపన్నహస్తం అందించడంతో పవన్ ముందుంటారని పేరు.. అలానే ఇప్పుడు తన నిర్మాణంతో మరికొంతమందికి అండగా ఉండేందుకు సిద్దమయ్యారా? అంటూ వివిధరకాల చర్చలు సాగుతున్నాయి. మరి పవన్ ఏ ఉద్దేశ్యంతో ఈ పనికి పూనుకున్నారో ఏమో!