ATMల వద్ద ప్రజలపై దాడి చేసిన కోడి.. పోలీసుల గాలింపు చర్యలు

సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఏటీఎం వద్ద లైన్లో నిలబడి డబ్బుల కోసం ఎదురుచూస్తున్న బ్యాంకు కస్టమర్లపై కోడి విరుచుకుపడింది. అక్కడున్న వారిని చెదరగొట్టడమే కాకుండా అక్కడున్న కార్లలో దూరేందుకు ప్రయత్నించింది. ఎర్ర రంగులో 18 అంగుళాల పొడవుతో, 6 నుంచి 8 పౌండ్ల బరువు ఉన్నట్లు వాకర్ పోలీసులు తెలిపారు.
అమెరికాలోని లూసియానాలో జరిగిన ఈ ఘటనతో పోలీసులు అలర్ట్ అయి దాని ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం చేసిన దాడితో ప్రజలు ఆ ఏటీఎం పరిసర ప్రాంతాలకు వెళ్లడానికి భయపడుతున్నారు.
ఓ రాత్రి సమయంలో కోడి కనిపించిందని సమాచారం ఇచ్చిన క్షణాల్లోనే పోలీసులు అక్కడికి వచ్చారు. అప్పటికే ఆ అగ్రెసివ్ కోడిని అదుపు చేయలేకపోవడంతో అది తుర్రుమంది. దాన్ని పట్టుకోవడంలో విసుగుచెందిన పోలీసులు ఫేస్ బుక్ లో పోస్టు పెట్టి కోడి జాడ తెలియడం లేదు. ఆచూకీ తెలిసిన వారు తెలియజేయగలరు అంటూ పోస్టు పెట్టారు.
Read Here>> కలర్ ఫుల్ మాస్క్‌లతో రెడీ అవుతోన్న ట్రికినీలు