Pooja Ramachandran : తల్లి కాబోతున్న మరో హీరోయిన్.. భర్తకి లిప్ లాక్ ఇస్తూ ఫోటోలు షేర్ చేసిన పూజా రామచంద్రన్..

తాజాగా తాను తల్లి కాబోతున్నాను అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది పూజా రామచంద్రన్. తన భర్తకి లిప్ లాక్ ఇస్తున్న ఫోటోలని షేర్ చేసి................

Pooja Ramachandran : తల్లి కాబోతున్న మరో హీరోయిన్.. భర్తకి లిప్ లాక్ ఇస్తూ ఫోటోలు షేర్ చేసిన పూజా రామచంద్రన్..

Pooja Ramachandran becoming mother soon

Updated On : November 13, 2022 / 9:42 AM IST

Pooja Ramachandran :  ఇటీవల పలువురు హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరికొంతమంది తల్లి కాబోతున్నామని హ్యాపీ న్యూస్ చెప్తున్నారు. ఇటీవలే అలియా భట్ ఓ పాపకి జన్మనిచ్చింది. బిపాషా బసు కూడా తాజాగా తల్లి అయింది. తాజాగా మరో హీరోయిన్ తల్లి కాబోతున్నాను అంటూ పోస్ట్ చేసింది.

తమిళ్, తెలుగు, మళయాలం సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయింది పూజా రామచంద్రన్. తెలుగులో స్వామిరారా సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 లో కూడా పార్టిసిపేట్ చేసింది. కొన్ని రోజుల క్రితం జాన్ కొక్కెన్ అనే మలయాళ నటుడ్ని పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తుంది.

Ram Charan : నాకు బెంగాలీ సినిమాల్లో నటించాలని ఉంది.. ఎవరైనా ఆఫర్ ఇస్తే బాగుండు.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

తాజాగా తాను తల్లి కాబోతున్నాను అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది పూజా రామచంద్రన్. తన భర్తకి లిప్ లాక్ ఇస్తున్న ఫోటోలని షేర్ చేసి.. ”ఇన్నాళ్లు మేమిద్దరం ఫుల్ గా, హ్యాపీగా ఎంజాయ్ చేశాం. ఇప్పుడు మాతో ఎంజాయ్ చేయడానికి మరో లిటిల్ బేబీ రాబోతుంది. 2023 మాకు స్పెషల్ గా మారబోతుంది” అని పోస్ట్ చేసింది. దీంతో పలువురు ప్రముఖులు, నెటిజన్లు పూజాకు అభినందనలు తెలుపుతున్నారు.