లిమిటెడ్ ఆఫర్.. రూ.499లకే 10000mAh పవర్ బ్యాంకులు..

Amazon Power Banks For Sale : ప్రస్తుత స్మార్ట్ ఫోన్లలో చాలావరకూ బ్యాటరీ ఛార్జింగ్ రోజుంతా నిలవడం లేదు. అలా అని అన్ని సమయాల్లో ఛార్జింగ్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాటరీ ఛార్జింగ్ దిగిపోయి ఫోన్ అత్యవసరం అనుకున్న సందర్భాల్లో పవర్ బ్యాంకులు బాగా ఉపకరిస్తాయి. ప్రత్యేకించి ఎక్కడైనా దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఫోన్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉండదు. ఇలాంటి సమయంలో పవర్ బ్యాంకు పక్కన ఉంటే కంగారు పడాల్సిన పని ఉండదు.
ముందు జాగ్రత్త కోసం చాలామంది పవర్ బ్యాంకు వెంట తీసుకెళ్లుతున్నారు. కొంతమంది పవర్ బ్యాంకు ఏది కొనాలా? అని ఈ-కామర్స్ సైట్లలో తెగ వెతికేస్తుంటారు. అలాంటి వారి కోసం అమెజాన్ వెబ్ సైట్లో కొత్త పవర్ ఫుల్ పవర్ బ్యాంకు సేల్ మొదలైంది.
డిసెంబర్ 13 నుంచి అమెజాన్ సేల్ మొదలైంది. మూడు రోజుల (డిసెంబర్ 15) పాటు అందుబాటులో ఉంటుంది. ఇందులో పలు బ్రాండ్ల పవర్ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన బ్రాండ్ పవర్ బ్యాంకులను కొనుగోలు చేయొచ్చు. అమెజాన్ సేల్ లో రెడ్ మి పవర్ బ్యాంక్ ప్రత్యేకంగా యూజర్లను ఆకట్టుకుంటోంది. URBN 10000mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. అతి తక్కువ ధరకు అందిస్తోంది.
కేవలం రూ.499లకు లభించనుంది. ఈ అల్ట్రా స్లిమ్ పవర్‌బ్యాంక్ 10000mAh సామర్థ్యంతో వస్తుంది. 12వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. పవర్‌బ్యాంక్ బరువు కేవలం 354 గ్రాములు. 12W ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. 3000mAh బ్యాటరీ కంటే 2.4 సార్లు రెట్టింపు, 4000mAh బ్యాటరీ కంటే 1.8 రెట్టింపు సామర్థ్యంతో పనిచేస్తుంది. 2.4 AMP 5V డ్యుయల్ USB పోర్టులు ఉన్నాయి.
Redmi 1000mAh :
రెడ్‌మి పవర్ బ్యాంక్ 1000mAh సామర్థ్యంతో వస్తుంది. దీని ధర రూ. 699లకే అందుబాటులో ఉంది. పవర్‌బ్యాంక్ బరువు 246.5 గ్రాములు. ఛార్జ్ చేయడానికి 7.5 గంటలు పడుతుంది. రెండు అవుట్ పుట్ పోర్టులు, రెండు ఇన్ పుట్ పోర్టులు ఉన్నాయి. 3000mAh బ్యాటరీ 2.1 సార్లు, 4000mAh ఫోన్ బ్యాటరీ 1.75 సార్లు ఛార్జింగ్ వస్తుంది. 246.5 గ్రాముల బరువు ఉంటుంది.
Ambrane 10000mAh :
అంబ్రేన్‌కు చెందిన ఈ పవర్‌బ్యాంక్ ధర 649 రూపాయలు ఉంటుంది. పవర్‌బ్యాంక్ పూర్తిగా ఛార్జ్ కావడానికి 5 నుండి 7 గంటలు సమయం పడుతుంది. ఐఫోన్ 8తో ఛార్జ్ చేస్తే 4.6 సార్లు వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ J7కు 2.8 సార్లు, MI 2 ఫోన్ ఛార్జ్ చేస్తే 2 సార్లు, Redmi 6A ఫోన్ కు 2.1 సార్లు ఛార్జింగ్ వస్తుంది.
Cisco 10000mAh :
సిస్కోకు చెందిన 10000mAh బ్యాటరీతో కూడిన ఈ పవర్‌బ్యాంక్ ధర రూ.599లకే లభిస్తోంది. LED ఫ్లాష్‌లైట్ కూడా వస్తోంది. ఇందులో ఓవర్‌ఛార్జింగ్, డిశ్చార్జింగ్ ప్రొటక్షన్ కూడా అందిస్తోంది. 3080mAh బ్యాటరీతో Mi A1 ఫోన్ కు 2.18 సార్లు ఫుల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఐఫోన్ 7 ఫోన్ అయితే 3.42 సార్లు ఫుల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు.