Prabhas Upcoming Film: యేలేటితో ప్రభాస్.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్!
బాలీవుడ్ హీరోలు కాదుకదా వాళ్ళని తలదన్నేలా పెరిగిపోయింది ఇప్పుడు మన తెలుగు హీరో ప్రభాస్ క్రేజ్. ఇండియాలో ఏ బాషా దర్శకుడైనా ప్రభాస్ తో సినిమా చేయాలని ఆరాటపడుతున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపించే ఒక టాక్.

Prabhas With Chandrasekhar Yeleti Fans Expressing Surprise
Prabhas Upcoming Film: బాలీవుడ్ హీరోలు కాదుకదా వాళ్ళని తలదన్నేలా పెరిగిపోయింది ఇప్పుడు మన తెలుగు హీరో ప్రభాస్ క్రేజ్. ఇండియాలో ఏ బాషా దర్శకుడైనా ప్రభాస్ తో సినిమా చేయాలని ఆరాటపడుతున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపించే ఒక టాక్. అయితే.. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడేళ్ళకు సరిపడా సినిమాలున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధేశ్యాం’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాకపోగా అదే సమయంలో ఓంరౌత్ దర్శకత్వంలో ‘ఆది పురుష్’ కూడా మొదలుపెట్టాడు.
కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఆదిపురుష్ షూటింగ్ వాయిదా పడింది. ఇక రాధేశ్యాం పూర్తిచేసి ఆదిపురుష్ తో పాటు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ కూడా మొదలుపెట్టనున్నాడు. ఈ మూడు సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్, సిద్ధార్థ్ ఆనంద్ తో మరో పాన్ ఇండియా సినిమాకు ఒకే చెప్పాడు. మొత్తం మీద ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఐదు సినిమాలున్నాయి. ఇవి కాకుండా తెలుగు లేడీ డైరెక్టర్ సుధా కొంగరతో ప్రభాస్ సినిమా చేయనున్నాడని ఈ మధ్య బాగా వినిపిస్తున్న గాసిప్.
సుధా కొంగరతో సినిమా అని అనుకుంటుండగానే ఇప్పుడు మరో విలక్షణ దర్శకుడితో ప్రభాస్ సినిమాకు చర్చలు జరుగుతున్నాయని కథనాలు మొదలయ్యాయి. ఆ విలక్షణ దర్శకుడు ఎవరో కాదు చంద్రశేఖర్ యేలేటినే. సుధా కొంగరతో కథా చర్చలు అనగానే ఔనా ఇది నిజమేనా అనే ఆశ్చర్యం వ్యక్తమయింది. ఎందుకంటే ప్రభాస్ ఒకే అంటే వందలకోట్లతో బడ్జెట్ తో సినిమా చేయాలని పెద్ద పెద్ద దర్శకులే క్యూలో ఉన్నారు. అలాంటపుడు చంద్రశేఖర్ యేలేటి లాంటి విభిన్న దర్శకుడితో ప్రభాస్ సినిమా అనగానే ఇప్పుడు ఆశ్చర్యపోవడం అభిమానుల వంతయింది.
ఎందుకంటే చంద్రశేఖర్ యేలేటి ఖచ్చితంగా ఒక విభిన్న చిత్రాల దర్శకుడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు కమర్షియల్ గా నిరాశ పర్చినా ఒక విభిన్న తరహా సినిమా అన్నట్లుగా మాత్రం టాక్ సొంతం చేసుకుంటుంది. కాగా, స్టార్ డం ఉన్న హీరోలతో యేలేటి చేసిన సినిమాలు సక్సెస్ అవడం ఖాయమనే టాక్ కూడా ఉంటుంది. ఎందుకంటే గతంలో గోపీచంద్ తో చేసిన ఒక్కడున్నాడు, సాహసం సినిమాలు ఇప్పటికీ టీవీలలో మంచి ఆదరణ దక్కించుకుంటాయి. అయితే, తాజాగా నితిన్ తో చేసిన చెక్ సినిమా నిరాశపర్చడంతో ప్రభాస్ తో కథా చర్చలు అనగానే ఆయన అభిమానులు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Read: Singer Sunitha: ఇది నేను ఊహించలేదు.. మందుబాబులపై సింగర్ సునీత కామెంట్స్!