Singer Sunitha: ఇది నేను ఊహించలేదు.. మందుబాబులపై సింగర్ సునీత కామెంట్స్!

ఈ మధ్యనే మరోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సింగర్ సునీత ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఉంటున్న సంగతి తెలిసిందే. కరోనా పరిస్థితులతో ఇంటికే పరిమితమైన సునీత సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ ప్రస్తుత పరిస్థితిల గురించి చర్చిస్తున్నారు.

Singer Sunitha: ఇది నేను ఊహించలేదు.. మందుబాబులపై సింగర్ సునీత కామెంట్స్!

Singer Sunitha Shocking Comments On Drinkers

Singer Sunitha: ఈ మధ్యనే మరోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సింగర్ సునీత ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఉంటున్న సంగతి తెలిసిందే. కరోనా పరిస్థితులతో ఇంటికే పరిమితమైన సునీత సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ ప్రస్తుత పరిస్థితిల గురించి చర్చిస్తున్నారు. ఇప్పుడు ఉన్న భయాలు, ఆందోళనలు దూరం చేసేలా అందరితో ముచ్చట్లు పెడుతూ.. తన గానామృతంతో కొంతసేపైనా ఉపశమనం కలిగిస్తున్నారు.

తన పాటలు వింటుంటే కొంత మందైనా సంతోషంగా ఉంటున్నారంటూ, వారి కోసం ప్రతీ రోజూ కొంత సమయం కేటాయిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ పై స్పందించిన సునీత మందుబాంబులపై షాకింగ్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో లైవ్‌లోకి వచ్చి అభిమానులను పలకరించిన సునీత లాక్‌డౌన్ కోసం తాను కూడా ఎదురుచూస్తున్నానని వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యల వల్ల పరిస్థితుల్లో కొంతమేర మార్పు వస్తుందని అనుకుంటున్నానని అభిప్రాయపడ్డారు.

లాక్‌డౌన్ అనడంతో అందరూ సరుకులు కొనడానికి షాపుల ముందు క్యూ కట్టారని.. రెండు రోజుల తరువాత ఈ రద్దీ ఉండకపోవచ్చని అనుకుంటున్నానని సునీత అన్నారు. ఇక లాక్‌డౌన్ అనగానే కిరాణా సామాగ్రి కోసం జనం షాపుల ముందు క్యూ కడతారని అనుకున్నారని.. కానీ మద్యం కోసం వైన్ షాపుల ముందు క్యూ కట్టడం తాను ఊహించలేదని అన్నారు. ఇది నిజంగా చాలా దురదృష్టకరమైన అంశమని పేర్కొన్న సునీత ఇలాంటి సమయంలో లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే సేఫ్‌గా ఉండాలని ఆమె కోరారు.