అక్క కోసం మెగా పవర్‌స్టార్ ప్రమోషన్..

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె శ్రీమతి సుస్మిత కొణిదెల నిర్మాతగా కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఓయ్’ ఫేమ్ ఆనంద్ రంగ దర్శకత్వంలో భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి ఆమె ‘షూట్ అవుట్ ఎట్ అలైర్’ (Shoot Out At Alair) అనే వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, నందిని రాయ్, గాయత్రి గుప్తా ప్రధాన పాత్రల్లో నటించారు.
జీ 5 లో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 నుండి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి, అక్క నిర్మాతగా చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ.. టీం కు శుభాకంక్షలు తెలియజేశారు.