Driving Licence : మాస్ మహారాజా – మెగా పవర్‌స్టార్ మల్టీస్టారర్..

రవితేజ - రామ్ చరణ్.. మూవీ లవర్స్, మెగాభిమానులు, మాస్ మహారాజా ఫ్యాన్స్‌కు మాంచి కిక్కిచ్చే క్రేజీ కాంబినేషన్ ఇది..

Driving Licence : మాస్ మహారాజా – మెగా పవర్‌స్టార్ మల్టీస్టారర్..

Ram Charan Bought Remake Rights Of Driving Licence

Updated On : June 16, 2021 / 10:02 PM IST

Driving Licence: సౌత్‌లో ఈ మధ్య రీమేక్‌ల హంగామా కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే ఒక భాషలో హిట్ అయిన సినిమాని వారి నేటివిటీకి తగ్గట్టు తమ ప్రేక్షకులకు చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు స్టార్స్ అండ్ మేకర్స్. ఇద్దరు స్టార్స్ కలిసి నటించిన రీమేక్‌ మల్టీస్టారర్ అయితే ఫ్యాన్స్‌కి పండగే. అలాంటి సినిమాలకుండే క్రేజే వేరు.

ఇప్పుడు తెలుగులో అటువంటి క్రేజీ ప్రాజెక్ట్ ఒకటి తెరకెక్కనుందనే న్యూస్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మలయాళంలో సెన్సేషనల్ హిట్ అయిన
‘డ్రైవింగ్ లైసెన్స్’ మూవీని తెలుగులో రీమేక్ చెయ్యడానికి రామ్ చరణ్ రైట్స్ కొన్నారట. మలయాళంలో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా హీరోగా, సూరజ్ మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా పోటాపోటీగా నటించారు.

తెలుగు రీమేక్‌లో మాస్ మహారాజా రవితేజ.. పృథ్వీరాజ్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్.. సూరజ్ క్యారెక్టర్లలో కనిపించనున్నారని అంటున్నారు. రవితేజ – రామ్ చరణ్.. మూవీ లవర్స్, మెగాభిమానులు, మాస్ మహారాజా ఫ్యాన్స్‌కు మాంచి కిక్కిచ్చే క్రేజీ కాంబినేషన్ ఇది. త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.