కెమెరామెన్ ప్రాణం కాపాడబోయి చనిపోయిన మినిస్టర్
వ్లామిదిర్ పుతిన్ 2018లో ప్రెసిడెంట్ గా రీఎలెక్ట్ అయినప్పటినుంచి ఎమర్జెన్సీ సిట్యుయేషన్ మినిస్టర్ గా జినిచెవ్ సేవలందిస్తున్నారని స్థానిక మీడియా తెలిపింది.

Russian Minister
Russia : రష్యా అత్యవసర పరిస్థితుల శాఖ మంత్రి యెవ్జెనీ జినిచెవ్ దురదృష్టవశాత్తూ చనిపోయారు. ఆయన వయస్సు 55 ఏళ్లు. ఆర్కిటిక్ మహా సముద్ర పరిధిలో స్ట్రాటజిక్ సివిల్ డిఫెన్స్, మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ లో ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు రష్యా అధికారులు తెలిపారు.
IPL Ad Revenue : ఐపీఎల్‌లో 10 సెకన్ల యాడ్‌కు టీవీలు ఎంత వసూల్ చేస్తాయంటే?
ఆర్కిటిక్ జోన్ నోరిల్స్క్ ప్రాంతంలో ఎమర్జెన్సీ రెస్క్యూ ఆపరేషన్ కోసం ట్రైనింగ్ సెషన్ నిర్వహిస్తున్నారు. ఈ ఆపరేషన్ ను రష్యన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్ మినిస్టర్ జినిచెవ్ పర్యవేక్షిస్తున్నారు. సముద్ర జలాల్లో జరుగుతున్న ట్రైనింగ్ సెషన్ ను వీడియో షూట్ చేస్తూ… ఓ కెమెరామెన్ నీళ్లలో పడిపోయాడు. వాటర్ లో పడిపోయిన ఆ వ్యక్తిని కాపాడేందుకు సముద్ర జలాల్లోకి జంప్ చేశారు జనిదెవ్. అంతే.. ఆ తర్వాత.. జనిదెవ్ జాడ తెలియలేదు. పడిపోయిన కెమెరామెన్ కూడా మృతిచెందాడు. సోల్జర్స్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎంత వెదికినా ఇద్దరి ఆచూకీ తెలియలేదు.
Shanmukh Jaswanth : నావల్ల కాదు.. వెళ్లిపోయి వీడియోలు చేసుకుంటా..
వ్లామిదిర్ పుతిన్ 2018లో ప్రెసిడెంట్ గా రీఎలెక్ట్ అయినప్పటినుంచి ఎమర్జెన్సీ సిట్యుయేషన్ మినిస్టర్ గా జినిచెవ్ సేవలందిస్తున్నారని స్థానిక మీడియా తెలిపింది.