Dream11 : డ్రీమ్ 11 కొత్త బిజినెస్.. రూ.10 పెట్టుబడి.. ఇంకా..

Dream11 : డ్రీమ్ మనీ గోల్డ్ కొనేందుకు రోజువారీ లేదా నెలవారీ ప్రాతిపదికన SIPలో రూ. 10 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు.

Dream11 : డ్రీమ్ 11 కొత్త బిజినెస్.. రూ.10 పెట్టుబడి.. ఇంకా..

Dream11

Updated On : August 23, 2025 / 6:48 PM IST

Dream11 : పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. డ్రీమ్ 11 కొత్త బిజినెస్‌‍తో రాబోతుంది. డ్రీమ్ స్పోర్ట్స్ డ్రీమ్ మనీ అనే పర్సనల్ మనీ మేనేజ్‌మెంట్ యాప్‌ను (Dream11) తీసుకొస్తోంది. ఈ యాప్ ద్వారా ఆసక్తిగల పెట్టుబడిదారులు సులభంగా బంగారం, స్థిర డిపాజిట్లలో పెట్టుబడి పెట్టవచ్చు.

అంతేకాదు.. ఖర్చులను ట్రాక్ చేయొచ్చు. భారత్ కొత్త ఆన్‌లైన్ గేమింగ్ చట్టానికి అనుగుణంగా ప్రధాన ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్11లో అన్ని పేమెంట్ గేమ్స్ నిలిపివేసింది. కేవలం ఫ్రీగా ఆడే ఆన్‌లైన్ సోషల్ గేమ్‌లకు మారేందుకు సిద్ధమవుతోంది.

గోల్డ్ కొనొచ్చు.. రూ. 10తో SIP చేయొచ్చు :
డ్రీమ్ మనీ ద్వారా బంగారం కూడా కొనుగోలు చేయవచ్చు. రోజువారీ లేదా నెలవారీ ప్రాతిపదికన రూ. 10 నుంచి SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ప్రారంభించవచ్చు. ఇందుకోసం డిజిటల్ గోల్డ్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ ఆగ్‌మాంట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ యాప్ రూ. వెయ్యి నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ పెట్టుబడులను కూడా అందిస్తుంది. దీనికి బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు. ఎప్పుడైనా ఫండ్స్ విత్‌డ్రా చేసుకోవచ్చు.

Dream11 : అన్ని ఒకేచోట ట్రాకింగ్ :

అదనంగా, డ్రీమ్ మనీ, SEBI-రిజిస్టర్డ్ ఏఐ పెట్టుబడి సలహాదారు సిగ్‌ఫిన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇకపై పెట్టుబడిదారులు బ్యాంక్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్‌లు, స్టాక్‌లు, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్‌లు (ETF) వంటి ఆస్తులను లింక్ చేయొచ్చు.

తద్వారా తమ ఖర్చులు, ఆదాయం, పెట్టుబడులను ఒకే చోట ట్రాక్ చేయొచ్చు. ఈ యాప్ రోజువారీ, నెలవారీ ఆర్థిక లావాదేవీలు, క్యాష్ ఫ్లో ఆధారంగా స్మార్ట్ సిఫార్సులు, ఆస్తులకు సంబంధించి యానాలిసిస్ కూడా అందిస్తుంది.

Read Also : Apple iPhone 17 Launch : ఆపిల్ ఐఫోన్ క్రేజే వేరబ్బా.. గెట్ రెడీ.. వచ్చే సెప్టెంబర్‌లోనే ఐఫోన్ 17 సిరీస్ లాంచ్.. 5 బిగ్ అప్‌డేట్స్ మీకోసం..!

ఆర్బీఐ ఆదేశాలతో యాప్ సేవలు బంద్ :
ముంబైకి చెందిన ఈ సంస్థ గతంలో ఫిన్‌టెక్ ఆఫర్లను అందించగా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (PPI) లైసెన్స్ కలిగిన పైన్ ల్యాబ్స్‌ భాగస్వామ్యంతో మార్చి 2023లో యూపీఐ పేమెంట్ల యాప్ DreamXను ప్రారంభించింది. అయితే, జూన్ 2023లో ఆర్బీఐ కో-బ్రాండెడ్ ఏర్పాట్ల కింద అందించే యూపీఐ సర్వీసులను నిలిపివేయాలని ఆదేశించడంతో ఆ యాప్‌ను క్లోజ్ చేశారు.

డ్రీమ్ 11తో పాటు డ్రీమ్ స్పోర్ట్స్‌లో స్పోర్ట్స్ కంటెంట్, కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్యాన్‌కోడ్, స్పోర్ట్స్ ఎక్స్‌పీరియన్స్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్‌సెట్‌గో, మొబైల్ గేమ్ డెవలప్‌మెంట్ యూనిట్ డ్రీమ్ గేమ్ స్టూడియోస్, డ్రీమ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ వంటి బ్రాండ్‌లు కూడా ఉన్నాయి.

2008లో హర్ష్ జైన్, భవిత్ సేథ్ స్థాపించిన డ్రీమ్ స్పోర్ట్స్ చివరిగా 8 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉంది. నవంబర్ 2021లో ఫాల్కన్ ఎడ్జ్, DST గ్లోబల్, D1 క్యాపిటల్, రెడ్‌బర్డ్ క్యాపిటల్, టైగర్ గ్లోబల్, TPG, ఫుట్‌పాత్ వెంచర్స్ నేతృత్వంలోని ఫండ్స్ గ్రూప్ నుంచి 840 మిలియన్ ఫండ్స్ సమకూరాయి. 2023 ఆర్థిక సంవత్సరానికి డ్రీమ్ స్పోర్ట్స్ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 66 శాతం పెరిగి రూ.6,384.49 కోట్లకు చేరుకుంది.

2022 ఆర్థిక సంవత్సరంలో రూ.3,841 కోట్లుగా ఉంది. కంపెనీ ఆదాయంలో ఎక్కువ భాగం డ్రీమ్11 వాటానే కలిగి ఉండటం గమన్హారం. అలాగే, భారత్‌లో ఇతర మనీ మేనేజ్‌మెంట్, ఎక్స్‌పెన్స్ ట్రాకర్ యాప్‌లలో Fi.Money, Jupiter Money, Moneyview ఉన్నాయి. Jar వంటి స్టార్టప్‌లు కూడా ప్లాట్‌ఫామ్‌లలో గోల్డ్ SIP చేసేందుకు వీలు కల్పిస్తున్నాయి.