Kukatpally Sahasra Case: వాడొచ్చింది బ్యాటు కోసం కాదు..! అందరి ముందు ఎన్‌కౌంటర్ చేయాలి.. సహస్ర తండ్రి సంచలన డిమాండ్..

ఆమె తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించారు.

Kukatpally Sahasra Case: వాడొచ్చింది బ్యాటు కోసం కాదు..! అందరి ముందు ఎన్‌కౌంటర్ చేయాలి.. సహస్ర తండ్రి సంచలన డిమాండ్..

Updated On : August 23, 2025 / 6:27 PM IST

Kukatpally Sahasra Case: హైదరాబాద్ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దారుణ హత్యకు గురైన సహస్రకు న్యాయం చేయాలంటూ ఆమె తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించారు. తమ బిడ్డను అత్యంత కిరాతకంగా చంపిన వాడిని అందరి ముందు చంపేయాలని, అతడి తల్లిదండ్రులను కూడా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

వాడు వచ్చింది బ్యాటు కోసం కాదు..

తమ కూతురిని హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని సహస్ర తండ్రి కృష్ణ డిమాండ్ చేశారు. నిందితుడిని తమ ముందుకు తీసుకురావాలన్నారు. బాలుడు బ్యాట్ కోసం వచ్చాడని పోలీసులు చెబుతున్నారు.. కానీ, వాడు వచ్చింది బ్యాటు కోసం కాదని కృష్ణ అన్నారు. తన కూతురిని హత్య చేసేందుకు బాలుడు ప్రీ ప్లాన్డ్ గా కత్తితో వచ్చాడని ఆయన ఆరోపించారు.

బ్యాట్ కోసం వస్తే కత్తి ఎందుకు తెస్తాడు?

”నాకు కచ్చితంగా న్యాయం జరగాలి. బాలుడు బ్యాట్ కోసం వచ్చాడని పోలీసుల విచారణలో చెప్పాడని అంటున్నారు. బ్యాట్ కోసం వస్తే కత్తి ఎందుకు తెస్తాడు? ప్రీ ప్లాన్డ్ డా వచ్చాడు. వాడిది మేజర్ మైండ్. వాడిని ఇదే రోజు ఎన్ కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఎక్కువ రోజులు గడువు తీసుకోవద్దు. స్లిప్ రాసుకుని వచ్చాడు, వెంట కత్తి కూడా తెచ్చుకున్నాడు. దొంగతనానికి వచ్చి నా పాపను చంపేశాడు. నా పాప తిరిగి రాదు. వాడిని కాల్చేయండి. ఇదే నా విజ్ఞప్తి” అని సహస్ర తండ్రి అన్నారు.

”మా ముందు వాడిని చంపండి. అందరి ముందు చంపేయాలి. అదే మా డిమాండ్. ఇది ఒక తల్లి ఆవేదన. నేను ఎందుకు డిమాండ్ చేయకూడదు. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేశాను. మేము ఎందుకు ఊరుకోవాలి. చిన్న బ్యాట్ కోసం హత్య చేస్తాడా?” అని సహస్ర తల్లి అన్నారు.

Also Read: వామ్మో.. సహస్ర హత్యకేసులో నమ్మలేని నిజాలు.. ఆ వెబ్‌సిరీస్‌లు, క్రైమ్ మూవీలు చూసి.. క్రికెట్ బ్యాట్ చోరీకి వచ్చి.. గుట్టు వీడిందిలా..