Budget Friendly CNG Cars : కొత్త కారు కొంటున్నారా? అద్భుతమైన మైలేజీని అందించే రూ. 10 లక్షల లోపు బడ్జెట్‌లో 5 CNG కార్లు..

Budget Friendly CNG Cars : కొత్త కారు కొనేవారి కోసం ప్రస్తుతం మార్కెట్లో రూ. 10 లక్షల లోపు ధరలో 5 CNG కార్లు లభ్యమవుతున్నాయి.

Budget Friendly CNG Cars : కొత్త కారు కొంటున్నారా? అద్భుతమైన మైలేజీని అందించే రూ. 10 లక్షల లోపు బడ్జెట్‌లో 5 CNG కార్లు..

Budget Friendly CNG Cars

Updated On : August 23, 2025 / 5:45 PM IST

Budget Friendly CNG Cars : కొత్త కారు కొంటున్నారా? అయితే ఈవీ కారు తీసుకోవాలా? CNG కారు తీసుకోవాలా? అని ఆలోచిస్తున్నారా? మీ బడ్జెట్, ఫ్యూయిల్ కెపాసిటీ, మైలేజీ కోసమైతే (Budget Friendly CNG Cars) మీరు రూ. 10 లక్షల లోపు ధరలో CNG కార్లు కొనుగోలు చేయొచ్చు. మారుతి ఆల్టో K10 CNG కేవలం రూ.5.96 లక్షలతో 33.85 కిమీ/కిలో మైలేజీతో అగ్రస్థానంలో నిలిచింది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ CNG కారు కాంపాక్ట్ SUV స్టైలింగ్‌ను అందిస్తుంది. మీరు రోజువారీ ప్రయాణీకులైతే 2025లో CNG కార్లు ఎంచుకోవచ్చు. సరసమైన ధరలో మాత్రమే కాదు.. ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయి. రోజువారీ ప్రయాణాలకు అద్భుతంగా ఉంటాయి. భారతీయ మార్కెట్లో అద్భుతమైన మైలేజీని అందించే రూ. 10 లక్షల లోపు ధరలో 5 బెస్ట్ CNG కార్లను ఓసారి పరిశీలిద్దాం.

1. మారుతి ఆల్టో K10 CNG :
కొత్త మారుతి ఆల్టో K10 CNG అత్యంత సరసమైనది. ఈ కార్ల విషయానికి వస్తే మైలేజ్ కింగ్ అంటారు. మారుతి ఆల్టో K10 CNG ప్రారంభ ధర రూ. 5.96 లక్షల నుంచి వస్తుంది. 33.85 కిమీ/కిమీ మైలేజీని అందిస్తుంది. ఈ కాంపాక్ట్ కారు బడ్జెట్-స్పృహ కలిగిన కొనుగోలుదారులకు టాప్ ఆప్షన్. మైలేజీ విషయంలో రాజీ పడాల్సిన అవసరం ఉండదు. రోజువారీ ఆఫీసు, సాధారణ ప్రయాణాలకు సరైన కారు.

Budget Friendly CNG Cars : 2. టాటా టియాగో CNG :

టాటా టియాగో సీఎన్‌జీ స్టైలిష్, మల్టీఫేస్ కాంపాక్ట్ SUV కారు ధర రూ. 6.80 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు అందిస్తుంది. మాన్యువల్‌లో 26.49 కిమీ/కిమీ, ఆటోమేటిక్‌లో 28.06 కిమీ/కిమీ మైలేజీని అందిస్తుంది. టియాగో ఆటోమేటిక్ ఆప్షన్ కలిగిన కొన్ని CNG కార్లలో ఇదొకటి. ఈ కేటగిరీలో టాటా టియాగో CNG బెస్ట్ ఆప్షన్లలో అందిస్తుంది. సిటీ ట్రాఫిక్‌లో ఒత్తిడి లేని డ్రైవింగ్ కోరుకునే వారికి బెస్ట్ కారు.

Read Also : Smart TVs : కొత్త స్మార్ట్‌టీవీ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌‌లో రూ. 24వేల లోపు ధరలో 55 అంగుళాల స్మార్ట్‌టీవీలు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

3. హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ CNG :
ఈ ఫీచర్లతో నిండిన హ్యాచ్‌బ్యాక్ అందరికీ నచ్చేదే. మిడ్ రేంజ్ ధర కారణంగా మైలేజ్‌తో ఫీచర్లు అవసరమైన వారికి బెస్ట్ కారు. ఈ SUV ధర రూ. 7.68 లక్షల నుంచి 27 కి.మీ/కి.మీ మైలేజీతో ప్రారంభమవుతుంది. ఇంధన సామర్థ్యం విషయంలో రాజీ పడాల్సిన అవసరం ఉండదు. టెక్ ఫ్రీక్‌లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైడ్ రేంజ్ ఇంటీరియర్‌ వంటి అదనపు ఫీచర్లను ఇష్టపడే వారికి ఈ కారు అద్భుతంగా ఉంటుంది.

4. టయోటా గ్లాంజా CNG
ఈ ప్రీమియం SUV హై-టెక్, అడ్వాన్స్, కాంపాక్ట్ ఫీచర్లతో వస్తుంది. ఈ CNG కారు ధర రూ. 8.80 లక్షల ఎక్స్-షోరూమ్ నుంచి ప్రారంభమై 30.61 కిమీ/కిలో మైలేజీని అందిస్తుంది. ఈ ధరలో టయోటో బెస్ట్ మోడల్. గ్లాంజా మైలేజ్ ఫిగర్‌తో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. స్టయిల్, స్పేస్, సెక్యూరిటీ, సేవింగ్స్ కోరుకునే వారికి సరైన సీఎన్‌జీ కారుగా చెప్పవచ్చు.

5. హ్యుందాయ్ ఎక్స్‌టర్ CNG :
ఈ హ్యుందాయ్ CNG కారు అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది. పొడవుగా, మృదువుగానూ అడ్వాన్స్ వైబ్‌ టెక్నాలజీతో వస్తుంది. మీ బడ్జెట్‌ ధరలోనే ప్రీమియం SUV ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ధర రూ. 9.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 27.1కి.మీ/కి.లో మైలేజీని అందిస్తుంది. SUV లాంటి డిజైన్ కోరుకునే వారికి బెస్ట్ కారు. ఎక్స్‌టర్ సీఎన్‌జీ సిటీ డ్రైవ్‌లతో పాటు వీకెండ్ టూర్లకు బెస్ట్ కారు.