Sai Pallavi : బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ.. సాయి పల్లవి కూడా నో చెప్పేసిందా?..

రీసెంట్‌గా 2 కోట్ల రూపాయల మెగా డీల్‌ని రిజెక్ట్ చేసింది సాయి పల్లవి. తనకు నచ్చకపోతే వెంటనే నో చెప్పేసే ఈ మలయాళీ ముద్దుగుమ్మ.. ఈసారి హ్యాండిచ్చింది ఎవరికో తెలుసా..?

Sai Pallavi : బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ.. సాయి పల్లవి కూడా నో చెప్పేసిందా?..

Sai Pallavi Rejects Chatrapati Hindi Remake Offer

Updated On : May 12, 2021 / 5:56 PM IST

Sai Pallavi: నో డౌట్ ఆమె నేచురల్ స్టార్. గ్లామర్ డాల్‌గా కనిపించకపోయినా నటనతోనే కట్టిపడేస్తుంది. డాక్టర్ చదివి యాక్టరైన ఆ హీరోయిన్ డెసిషన్స్ మాత్రం ఒక్కోసారి షాకిస్తాయి. అవును రీసెంట్‌గా 2 కోట్ల రూపాయల మెగా డీల్‌ని రిజెక్ట్ చేసింది సాయి పల్లవి. తనకు నచ్చకపోతే వెంటనే నో చెప్పేసే ఈ మలయాళీ ముద్దుగుమ్మ.. ఈసారి హ్యాండిచ్చింది ఎవరికో తెలుసా..?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘ఛత్రపతి’ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. వివి వినాయక్ దర్శకుడు. ఈ ప్రాజెక్ట్ కోసం కియారా అద్వానీ, అనన్య పాండే, దిశా పటాని, శ్రద్ధా కపూర్‌ల వంటి ఎంతోమంది హీరోయిన్స్ డేట్స్ కోసం సెర్చ్ చేశారు మేకర్స్. రీసెంట్‌గా సాయి పల్లవిని అప్రోచ్ అయ్యారని సమాచారం. ఆమెను ఒప్పించేందుకుగాను 2కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే బెల్లంకొండ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేనని షాకిచ్చారు సాయి పల్లవి.

Bellamkonda

సాయి పల్లవి అంతే.. డిఫరెంట్.. హ్యూజ్ మనీ కోసం తనకు నచ్చని రోల్స్‌కి ఎస్ చెప్పదు. ఇంతకుముందు కూడా మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోషియుం’ రీమేక్ సినిమాలను వద్దనుకుందనే వార్తొలొచ్చాయి. ఇక ప్రముఖ కాస్మెటిక్ కంపెనీ రెండు కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా.. ఓ కాస్మెటిక్ శరీరరంగు మారుస్తుందని చెప్పి ప్రజలను మోసం చేయలేనని తిరస్కరించింది. అంతేకాదు అది రంగులేని వారిని అవమానించడమేనని చెప్పుకొచ్చింది కూడా..

Love Story

నిజానికి బెల్లంకొండ ‘ఛత్రపతి’ రీమేక్‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టొచ్చు. భారీ రెమ్యూనరేషన్ ప్లస్ బాలీవుడ్ ఎంట్రీ కానీ సింపుల్‌గా నో చెప్పేసింది సాయి పల్లవి. ప్రస్తుతం ఆమె నటించిన ‘లవ్ స్టోరీ’, ‘విరాట పర్వం’ రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. నానితో ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలోనూ నటిస్తుంది. నితిన్ – వక్కంతం వంశీ ప్రాజెక్ట్‌లో ఓ డిఫరెంట్ రోల్ చెయ్యనుందని కూడా టాక్. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి, సాయి పల్లవితో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేసేందుకు ట్రై చేస్తున్నారు..

Virata Parvam