చై, సామ్ ఆన్‌స్క్రీన్ ప్రేమకు పదకొండేళ్లు..

చై, సామ్ ఆన్‌స్క్రీన్ ప్రేమకు పదకొండేళ్లు..

Updated On : February 26, 2021 / 9:35 PM IST

Samantha: సమంత అక్కినేని సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.. భర్త నాగ చైతన్యతో కలిసి సామ్ నటించిన బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఏమాయ చేసావె’ 2011 ఫిబ్రవరి 26న రిలీజ్ అయింది.. 2021 ఫిబ్రవరి 26 నాటికి సక్సెస్‌ఫుల్‌గా 11 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది.

Ye Maya Chesave

ఈ సందర్భంగా తనను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియో విడుదల చేసింది సమంత. 11 సంవత్సరాల లాంగ్ జర్నీ చిన్న విషయం కాదు.. మీ ఆదరాభిమానల వల్లే ఇది సాధ్యమైంది.. హ్యాపీ యానివర్సరీ టు మి, హ్యాపీ యానివర్సరీ టు యు.. ఇన్నేళ్లలో ఎన్నో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి’’ అంటూ సమంత వీడియోలో పేర్కొంది.

Ye Maya Chesave

నాగ చైతన్య, సమంత జంటగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘ఏమాయ చేసావె’ లో ఆన్ స్క్రీన్ పెయిర్‌గా ఆకట్టుకున్న ఈ జంట ఎనిమిదేళ్ల డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకున్నారు. అక్కినేని ఇంటి కోడలుగా మారిన తర్వాత బిజినెస్‌‌లోనూ సత్తా చాటుతుంది సమంత.