Cancer With Sanitary Pads : షాకింగ్.. శానిటరీ ప్యాడ్స్ వాడకంతో క్యాన్సర్..! అధ్యయనంలో ఆందోళనకర విషయాలు వెల్లడి
శానిటరీ ప్యాడ్స్ వల్ల మహిళల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందా? శానిటరీ ప్యాడ్స్ వాడకంతో క్యాన్సర్ ముప్పు ఉందా? అంటే, అవునంటోంది ఓ అధ్యయనం. శానిటరీ ప్యాడ్‌లకు సంబంధించి తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.

Canncer With Sanitary Pads : శానిటరీ ప్యాడ్స్ వల్ల మహిళల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందా? శానిటరీ ప్యాడ్స్ వాడకంతో క్యాన్సర్ ముప్పు ఉందా? అంటే, అవునంటోంది ఓ అధ్యయనం. శానిటరీ ప్యాడ్‌లకు సంబంధించి తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.
ఆ అధ్యయనం ప్రకారం.. మన దేశంలో పీరియడ్స్ సమయంలో బాలికలు, మహిళలు ధరించే శానిటరీ ప్యాడ్ల వల్ల క్యాన్సర్ ముప్పు ఉందని ఢిల్లీకి చెందిన టాక్సిక్స్ లింక్ (Toxics Link) అనే ఎన్జీవో అధ్యయనంలో వెల్లడైంది. ఇండియాలో అమ్మే ప్యాడ్లలో (ఆర్గానిక్, ఇన్ ఆర్గానిక్) ఎక్కువ మోతాదులో ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్నాయని, దీని వల్ల క్యాన్సర్, గుండె సంబంధ వ్యాధులు, డయాబెటిస్, ఆస్తమా, సంతానలేమి లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని అధ్యయనం తెలిపింది.
”ఇది నిజంగా షాకింగ్ న్యూస్. ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ప్రతిచోటా సులభంగా లభించే శానిటరీ నాప్‌కిన్‌లలో ఇలాంటి అనేక రసాయనాలు ఉన్నాయి. శానిటరీ ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాలు, పునరుత్పత్తి విషపదార్థాలు, ఎండోక్రైన్ డిస్‌రప్టర్లు, అలర్జీలు కలిగించే అనేక తీవ్రమైన రసాయనాలు ఉన్నాయి. శానిటరీ న్యాప్‌కిన్ లలో వాడే కెమికల్.. క్యాన్సర్‌ను కలిగించడమే కాకుండా వంధ్యత్వానికి కారణం అవుతుంది” అని NGO టాక్సిక్స్ లింక్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, ఈ అధ్యయనంలో పాల్గొన్న డాక్టర్ అమిత్ చెప్పారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
”శానిటరీ ప్యాడ్ల వాడకం వల్ల వ్యాధుల ముప్పు ఎక్కువ కావడం అత్యంత ఆందోళన కలిగిస్తున్న విషయం. వాస్తవానికి ఈ తీవ్రమైన రసాయనాలు స్త్రీ చర్మంపై కంటే యోనిపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. అటువంటి పరిస్థితిలో దీని కారణంగా ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది” అని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఎన్జీవోకు చెందిన మరో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఆకాంక్ష ఆందోళన వ్యక్తం చేశారు.
NGO టాక్సిక్స్ లింక్ నిర్వహించిన ఈ అధ్యయనం భారత దేశంలో విక్రయించే 10 బ్రాండ్ల శానిటరీ న్యాప్‌కిన్ల ఉత్పత్తులను కలిగున్న ఇంటర్నేషనల్ పొల్యూటెంట్ ఎలిమినేషన్ నెట్‌వర్క్ పరీక్షలో భాగం. అధ్యయనం సమయంలో పరిశోధకులు అన్ని నమూనాలలో థాలేట్స్, అస్థిర కర్బన సమ్మేళనాల జాడలను కనుగొన్నారు. ఈ రెండు కలుషితాలు క్యాన్సర్ కణాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండటం ఆందోళన కలిగించే విషయం. 15-24 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో 64 శాతం మంది శానిటరీ ప్యాడ్‌లను ఉపయోగిస్తున్నారని తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది.
శానిటరీ ప్యాడ్లలో వాడే రెండు ప్రమాదకర కెమికల్స్ లో ఒకటి థాలేట్స్, మరొకటి VOC. ఈ రెండు రసాయనాలు చాలా డేంజర్. ఒక నివేదిక ప్రకారం, “ఆస్తమా, శ్రద్ధ-లోటు హైపర్యాక్టివిటీ డిజార్డర్, రొమ్ము క్యాన్సర్, ఊబకాయం, టైప్ II డయాబెటిస్, తక్కువ IQ” మరియు మరెన్నో రుగ్మతలు థాలేట్స్ వల్ల సంభవిస్తాయి.
శానిటరీ ప్యాడ్‌లలో కనిపించే ఇతర రసాయన భాగం VOC(Volatile Organic Compounds). శానిటరీ ప్యాడ్‌లలో కనిపించే అస్థిర సేంద్రియ సమ్మేళనాలకు (VOCలు) దీర్ఘకాలికంగా గురికావడం, కళ్ళు, ముక్కు, గొంతు యొక్క చికాకు, వికారం, అలసట, సమన్వయం కోల్పోవడం, మైకము, కాలేయం, మూత్రపిండాలు మరియు కేంద్ర నాడీ వ్యవస్థకు హాని కలిగించవచ్చు. ఈ రెండు కెమికల్స్ క్యాన్సర్ కు దారితీయొచ్చు.
సాధారణంగా.. పెయింట్లు, డియోడరెంట్లు, ఎయిర్ ఫ్రెషనర్లు, నెయిల్ పాలిష్ వంటి అనేక ఇతర ఉత్పత్తుల్లో ఈ రెండు హానికరమైన రసాయనాలు కనిపిస్తాయి. కానీ, శానిటరీ ప్యాడ్స్ లో వాడకం వల్ల యోని కణజాలానికి ప్రమాదకరంగా మారుతుంది. రసాయనాలు యోని ద్వారా మరింత సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తాయి.
భారత్ లో విక్రయించే శానిటరీ ప్యాడ్స్ లో ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్నాయని, వాటి కారణంగా క్యాన్సర్ ముప్పు ఉందని అధ్యయనంలో వెలుగుచూసిన అంశాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.