Sarkaru Vaari Paata : షూటింగ్ స్టార్ట్ అయ్యాకే అప్‌డేట్స్..

తిరిగి షూటింగ్ ప్రారంభించిన తర్వాత ‘సర్కారు వారి పాట’ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్..

Sarkaru Vaari Paata : షూటింగ్ స్టార్ట్ అయ్యాకే అప్‌డేట్స్..

Sarkaru Vaari Paata Movie Updates Only After Shooting Started

Updated On : June 11, 2021 / 5:41 PM IST

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ పరశురామ్ కలయికలో తెర‌కెక్కుతోన్న భారీ చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. త‌మ‌న్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే.. కాగా ‘సర్కారు వారి పాట’ షూటింగ్ తిరిగి ప్రారంభించిన తర్వాత ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ అధికారికంగా ప్రకటిస్తాం, అప్పటి వరకు కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ సురక్షితంగా ఉండండి.. అని చిత్ర యూనిట్ తెలిపింది.

సూప‌ర్‌ స్టార్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు మరియు భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి..
సంగీతం: త‌మన్ ఎస్‌.ఎస్‌
సినిమాటోగ్ర‌ఫి: మ‌ధి
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్
ఫైట్ మాస్టర్: రామ్ – లక్ష్మణ్
లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్
కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్
సీఈఓ: చెర్రీ
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట
రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల‌.