Saranga Dariya : సిల్వర్ స్క్రీన్ ‘సారంగ దరియా’ పాటకు స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీల డ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో..
దాని కుడి భుజం మీద కడవా.. దాని గుత్తపు రైకలు మెరియా.. అది రమ్మంటే రాదురా చెలియా.. దాని పేరే ‘‘సారంగ దరియా’’.. గతకొద్ది రోజులుగా ఎక్కడ విన్నా ఎవరి నోట విన్నా ఇదే పాట వినిపిస్తోంది.. ‘సారంగ దరియా’ అంటూ సాయి పల్లవి సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది..

Saranga Dariya
Saranga Dariya: దాని కుడి భుజం మీద కడవా.. దాని గుత్తపు రైకలు మెరియా.. అది రమ్మంటే రాదురా చెలియా.. దాని పేరే ‘‘సారంగ దరియా’’.. గతకొద్ది రోజులుగా ఎక్కడ విన్నా ఎవరి నోట విన్నా ఇదే పాట వినిపిస్తోంది.. ‘సారంగ దరియా’ అంటూ సాయి పల్లవి సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
Saranga Dariya Song : 100 మిలియన్ల సాయి పల్లవి ‘సారంగదరియా’..
తెలుగు ఇండస్ట్రీలో అతి తక్కువ టైం లో 100 మిలియన్లు సాధించిన పాటగా ‘సారంగ దరియా’ కొత్త రికార్డ్ సెట్ చేసింది. నార్మల్ ఆడియెన్స్ నుండి సెలబ్రిటీల వరకు ఈ పాటకు తమ స్టైల్లో కాలు కదిపారు. తాజాగా బుల్లితెర సెలబ్రిటీలు కూడా ‘సారంగదరియా’ పాటకు స్టెప్పులేశారు.
తెలుగు సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన హరిత, జయలలిత మరో బుల్లితెర నటితో కలిసి ‘సారంగదరియా’ పాటకు తమ స్టైల్లో స్టెప్పులేశారు. హరిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లేట్ అయినా లేటెస్ట్‌గా అన్నట్లు నెటిజన్లను ఆకట్టుకుంటోంది ఈ వీడియో.
View this post on Instagram