Covid 19 Effect
Covid-19 effect : కోవిడ్-19. పెను సమస్యలకు దారి తీస్తోంది. ఎన్నో రకాల వైరస్ లు వచ్చిపోయినాగానీ కరోనా వైరస్ మాత్రం వచ్చి కోలుకున్నాక కూడా పలు సమస్యలకు దారి తీస్తోంది. కరోనా నుంచి కోలుకుని ప్రాణాలతో బయటపడ్డాం కదాని సంతోషిస్తున్న క్రమంలో ఆ సంతోషాన్ని ఎక్కువ కాలం నిలవనివ్వటంలేదు. పలు అనారోగ్య సమస్యలకు గురిచేస్తోంది.మానసికంగా శారీరకంగా పలు ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈక్రమంలో కోవిడ్ తో మానసిక రుగ్మతలు వస్తున్నాయని తాజా పరిశోధనలో వెల్లడికావటం ఆందోళనకు గురిచేస్తోంది.
Read more : Long Covid : కరోనా నుంచి కోలుకున్న వారికి షాకింగ్ న్యూస్, ఏడాది తర్వాత కూడా ఆరోగ్య సమస్యలు
కోవిడ్ వైరస్ సోకి తీవ్రంగా ప్రభావం చూసినవారిలో మానసిక రుగ్మతలు ఉత్పన్నమవుతున్నట్లు అమెరికాలో నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడయ్యింది. కరోనా మొదలైన ప్రారంభ రోజుల్లో సుమారు 150 మంది కోవిడ్ రోగులపై స్టడీ చేయగా..వారిలో 73 మందికి మానసిక సమస్యలు వచ్చినట్లుగా తేలింది.బీఎంజే ఓపెన్ జర్నల్‌లో ఆ స్టడీకి చెందిన నివేదికను పబ్లిష్ చేశారు.
కోవిడ్ సోకి కోలుకున్నాక అది వారి మానసిక స్థితిపై పెను ప్రభావం చూపిందనీ..మానసిక స్థితిలో తీవ్రమైన చలనం జరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. కోవిడ్ అంటే విపరీతమైన భయం ఉండేది మొదట్లో. కానీ రాను రాను భయం తగ్గింది. కానీ కరోనా సోకిన వ్యక్తి అనవసరంగా భయాందోళనలకు గురికావటం వల్లలనే ప్రాణాపాయాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని అనేవారు ప్రారంభంలో. కానీ వారు అలా ఆందోళకు గురికావటం కరోనా వైరస్ ప్రభావం వల్లనే.
Read more : China Real Estate Crisis : చైనా నుంచి ప్రపంచానికి పొంచి ఉన్న మరో ముప్పు
కానీ అది కేవలం ఆందోళన మాత్రమే కాదని కరోనా సోకినవారికి మానసిక స్థితి గందరగోళంగా మారటం, తద్వారా ఆందోళనకు గురికావడం, మతిమరుపుకు లోనుకావడం, అస్పష్టంగా మాట్లాడడం లాంటి కేసులు నమోదు అయినట్లు పరిశోధకులు తెలిపారు. డెలీరియం లాంటి మానసిక వ్యాధి వల్ల కరోనా సోకిన వ్యక్తులు బలహీనపడుతారని..వారిల్లో హైబీపీ, డయాబెటిస్ లక్షణాలు కూడా ఉంటాయని ఆ స్టడీలో తేల్చారు.
Read more : Black Fungus : షాకింగ్.. కరోనాతోనే కాదు.. ఇంట్లో బ్రెడ్డు ముక్కతోనూ బ్లాక్ ఫంగస్
మిచిగన్ యూనివర్సిటీకి చెందిన రచయిత ఫిలిప్ విసైడ్స్ ఈ రిపోర్ట్‌ను పొందుపరిచారు. డెలీరియం వ్యాధిగ్రస్తుల మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుందని..దీని వల్ల రక్తం గడ్డకట్టడం లేదా స్ట్రోక్ రావడం జరుగుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. అంతేకాకుండా మెదడులో వాపు కూడా వస్తుందని..అటువంటివారిలో ఆందోళన, చికాగు ఎక్కువగా ఉంటాయన్నారు. ఇటువంటి పరిస్థితులు మానసిక రుగ్మతలకు కారణమవుతాయని వెల్లడించారు.