Long Covid : కరోనా నుంచి కోలుకున్న వారికి షాకింగ్ న్యూస్, ఏడాది తర్వాత కూడా ఆరోగ్య సమస్యలు

కరోనావైరస్ మహమ్మారి ఏ ముహూర్తాన వచ్చిందో కానీ మనుషులను చంపుకు తింటోంది. కరోనా కొత్త వేరియంట్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కరోనా కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు

Long Covid : కరోనా నుంచి కోలుకున్న వారికి షాకింగ్ న్యూస్, ఏడాది తర్వాత కూడా ఆరోగ్య సమస్యలు

Long Covid

Long Covid : కరోనావైరస్ మహమ్మారి ఏ ముహూర్తాన వచ్చిందో కానీ మనుషులను చంపుకు తింటోంది. కరోనా కొత్త వేరియంట్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కరోనా కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. కరోనా నుంచి కోలుకున్న ఏడాది తర్వాత కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అధ్యయనంలో తేలింది.

కరోనా బారిన పడి ఆసుపత్రి పాలైన వారిలో సగంమంది.. కోలుకున్న తర్వాత కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఏదో ఒక లక్షణంతో వారు ఇబ్బంది పడుతున్నట్టు తాజా స్టడీలో తేలింది.

లాన్సెట్ లో ఓ స్టడీ పబ్లిష్ అయ్యింది. దాని ప్రకారం చైనాలోని వుహాన్ లో 1,276 పేషెంట్లపై అధ్యయనం చేశారు. వారిలో 35.7శాతం మంది రోగులు ఇంకా వ్యాధితో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తులు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపించాయి. వారిలో రక్తం నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ఆక్సిజన్ సరఫరా తగ్గింది. అసలు కరోనా బారిన పడని వ్యక్తుల ఆరోగ్యంతో పోలిస్తే.. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల్లో ఆరోగ్య పరిస్థితి అధ్వానంగా ఉందని తేలింది.

కరోనా కారణంగా ఆసుపత్రి పాలై ఆ తర్వాత కోలుకున్న వారిని 12 నెలల తర్వాత పరీక్షిస్తే… వారిలో చాలా మంది ఏడాది తర్వాత కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు అని చైనా-జపాన్ ఫ్రెండ్ షిప్ హాస్పిటల్ ప్రొఫెసర్ బిన్ చావో చెప్పారు. లాన్సట్ నివేదిక ప్రకారం లాంగ్ కొవిడ్ ఓ పెద్ద మెడికల్ చాలెంజ్. ఆర్థికంగా నష్టాలు రావడంతో పాటు ఉత్పాదన తగ్గిపోతుంది.

లాన్సట్ నివేదిక ప్రకారం.. లాంగ్ కోవిడ్ ఒక పెద్ద వైద్య సవాల్. అంతేకాదు ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. దాంతోపాటే ప్రజల ఉత్పాదకతను తగ్గిస్తుంది. ప్రపంచంలోని మిలియన్ల మంది ప్రజలు బ్రెయిన్ ఫాగ్, శ్వాస ఆడకపోవడం, అలసట, డిప్రెషన్ వంటి నిరంతర లక్షణాల కారణంగా ప్రభావితమవుతున్నారు. ఈ వ్యాధిని సరిగ్గా అర్థం చేసుకోవడం అత్యంత ప్రాముఖ్యతని జోడిస్తుంది.

ఈ అధ్యయనంలో పాల్గొన్న రోగులంతా జనవరి 7 నుంచి మే 29, 2020 మధ్య డిశ్చార్జ్ అయిన వారే. వారిలో కొవిడ్ లక్షణాలు కనిపించిన రోజు నుంచి 6 నెలలు, 12 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేశారు. ప్రశ్నలు, ఆరు నిమిషాల వాకింగ్ టెస్ట్ ద్వారా వారి ఆరోగ్య పరిస్థితులు అధ్యయనం చేశారు.

ఆరు నెలల తర్వాత… 1227 మందిలో 831మంది(68శాతం) కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా కరోనాకు చెందిన ఏదో ఒక లక్షణంతో బాధపడుతూనే ఉన్నారు. ఇక 12 నెలల తర్వాత 1272 మందిలో 620మంది(49శాతం) ఏదో ఒక కరోనా లక్షణంతో బాధపడుతున్నట్టు గుర్తించారు.

53% మంది రోగులు ఇంకా ఆరు నెలల్లో అలసట లేదా కండరాల బలహీనత వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. 12 నెలల చివరిలో 20% కి పడిపోయింది. అయితే, శ్వాసలోపం ఎదుర్కొంటున్న రోగుల శాతం ఆరు నెలల్లో 26% నుండి 12 నెలల్లో 30% కి పెరిగింది. దాదాపు 25% మంది రోగులు, లేదా 317 మంది రోగులలో 79 మందికి ఆక్సిజన్ చికిత్స అవసరం లేదు. వారితో పోలిస్తే 39% మంది రోగులు (37/94), వారి చికిత్స సమయంలో వెంటిలేటర్ సపోర్ట్ అవసరమైన వారు శ్వాస తీసుకోవడంలో ఎక్కువ ఇబ్బంది పడ్డారు.

ఆరు నెలల నుండి 12 నెలల వరకు రోగుల ఊపిరితిత్తుల పనితీరులో పెద్దగా మెరుగుదల కనిపించ లేదు. 349 మంది రోగులలో 244 మందికి ఏడాది తర్వాత కూడా ఊపిరితిత్తుల పనితీరు సరిగా లేదు.

అలాగే, 353 మంది రోగులను ఆరు నెలలు, 12 నెలల పాటు CT స్కాన్ చేయించుకున్నారు, వారిలో 52.7% మంది 12 నెలల చివరిలో ఊపిరితిత్తుల పనితీరులో తేడాలు గమనించారు.

అధ్యయనంలో చేర్చబడిన రోగుల మధ్యస్థ లేదా సగటు వయస్సు 57 సంవత్సరాలు. దాదాపు 53% మంది రోగులు వ్యాధి బారిన పడకముందే పదవీ విరమణ చేశారు. ఉద్యోగం పొందిన 479 మంది రోగులలో, వారి ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత దాదాపు 88% మంది తిరిగి పనికి వచ్చారు. దాదాపు 76% (321/422) వారి పూర్వ-కోవిడ్ -19 స్థాయి పనికి తిరిగి రాగలిగారు.

ఇక పురుషులతో పోలిస్తే.. మహిళల అలసట లేదా కండరాల బలహీనతతో ఎక్కువగా బాధపడుతున్నారు. అలాగే డిప్రెషన్, ఊపిరితిత్తుల పనితీరులో తేడాలు కనిపించాయి. మొత్తంగా పరిశోధకులు చెప్పేది ఏంటంటే.. కోవిడ్ ఇన్‌ఫెక్షన్ బారిన పడిన రోగులకు దీర్ఘకాలిక మద్దతు అందించడానికి ఆరోగ్య వ్యవస్థలు సిద్ధంగా ఉండాలి.