Black Fungus : షాకింగ్.. కరోనాతోనే కాదు.. ఇంట్లో బ్రెడ్డు ముక్కతోనూ బ్లాక్ ఫంగస్

బ్లాక్ ఫంగస్ గురించి వైద్య నిపుణులు షాకింగ్ విషయాలు చెప్పారు. కరోనాతోనే కాదు ఇంట్లో బ్రెడ్ ముక్కతోనూ బ్లాక్ ఫంగస్ వచ్చే చాన్స్ ఉందన్నారు. ఇంకా బ్లాక్ ఫంగస్ గురించి ఏం చెప్పారంటే...

Black Fungus : షాకింగ్.. కరోనాతోనే కాదు.. ఇంట్లో బ్రెడ్డు ముక్కతోనూ బ్లాక్ ఫంగస్

Black Fungus

Black Fungus With Bread Piece : తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. రెండు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రెండు రోజుల్లోనే 8మంది బ్లాక్ ఫంగస్ ఇన్ ఫెక్షన్ తో చనిపోయారు. కరోనా నుంచి కోలుకున్నాం అని ఊపిరిపీల్చుకునే లోపే బ్లాక్ ఫంగస్ కమ్మేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 8మందిని ఈ ఫంగస్ బలి తీసుకుంది. మృతుల్లో ఎక్కువమంది 40ఏళ్ల లోపువారే.



ఫంగస్ బారిన పడ్డామని గుర్తించేలోపే జరగరాని నష్టం జరిగిపోతోంది. బ్లాక్ ఫంగస్ తో చనిపోయిన వారిలో తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా మైనార్టీ నేత ఎస్‌కే బుడాన్‌బేగ్‌(59) ఉన్నారు. కరోనా నుంచి కోలుకున్న రోగులు అప్రమత్తంగా ఉండాలని, బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉంటే, వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని నిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా చెప్పారు.

కరోనా సెకండ్ వేవ్ లో వైరస్ సోకిన తొలి 5 రోజులు కీలకమైనట్టే, బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించిన వెంటనే, చికిత్స పొందటం అత్యంత ముఖ్యం. కానీ, చాలామంది అవగాహన లోపంతో, తాము ఫంగస్ బారిన పడినట్టుగా గుర్తించలేకపోతున్నారు. కళ్లు ఎర్రగా మారడం, చూపు మందగించడం లాంటి చాలా లక్షణాలు ఇందులో కనిపిస్తున్నాయి.



బ్లాక్ ఫంగస్ గురించి ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ లాస్య సింధు కీలక విషయాలు చెప్పారు. కరోనాతో కాదు.. ఇంట్లో బ్రెడ్ ముక్కతోనూ బ్లాక్ ఫంగస్ వచ్చే చాన్స్ ఉందన్నారామె. ”బ్లాక్ ఫంగస్ అన్ని చోట్లా ఉంది. టేబుల్ పైన ఉండొచ్చు. రాటన్ వెజిటబుల్స్ లో ఉండొచ్చు. వెజిటబుల్స్ కొంచెం పాతగా అయిపోయినా, ప్రాసెస్డ్ ఫుడ్, బ్రెడ్ ఎక్కువ రోజులు అయిన తర్వాత తిన్నా కానీ, నిల్వ ఉంచిన మాంసం, చాలా రోజులు ఉంచిన గుడ్లు..వీటన్నింటిలో కూడా బ్లాక్ ఫంగస్ ఉండే చాన్సుంది. కాకపోతే, ఇమ్యూనిటీ వీక్ గా ఉండే వాళ్లని ఎఫెక్ట్ చేస్తుంది” అని డాక్టర్ లాస్య సింధు చెప్పారు.

బ్లాక్ ఫంగస్.. ఆహార పదార్ధాలను తినడం వల్ల వస్తుందా? గాలి పీల్చడం వల్ల వస్తుందా?
”కుళ్లిపోయినవి, ఎక్కువ కాలం నిల్వ ఉంచినవి ఎక్కువ స్థాయిలో తిన్నప్పుడు… ఫంగస్ గొంతులోకి వెళ్లి అక్కడి నుంచి ముక్కులోకి వెళ్తుంది. గాలిలో పీల్చినప్పుడు తక్కువ శాతంలో ఫంగస్ లోనికి వెళ్తుంది. తిన్నప్పటితో పోలిస్తే గాలిలో పీల్చినప్పుడు ఫంగస్ లోనికి వెళ్లే శాతం తక్కువ. బ్లాక్ ఫంగస్ అన్ని చోట్ల ఉంటుంది. మనం పీల్చే గాలిలో ఉంటుంది. తాగే నీళ్లలో ఉంటుంది. అవి చిన్న చిన్న గుడ్లలా ఉంటాయి. పచ్చళ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే వాటి మీద బూజులాగా వస్తుంది. ముక్కు ద్వారంలోనూ నార్మల్ గా ఉంటాయి. శరీరం మీదా ఉంటాయి. చుట్టుపక్కలా ఉంటాయి. కానీ, వాటికి.. మనల్ని డ్యామేజ్ చేసే శక్తి, అటాక్ చేసే శక్తి ఉండదు. స్నానం చేసినా లేదా శుభ్రం చేసుకున్నా వెళ్లిపోతుంది. బ్లాక్ ఫంగస్ ఎప్పుడు అటాక్ చేస్తుంది అంటే.. డిఫెన్స్ మెకానిజమ్ వీక్ అయినప్పుడు అటాక్ చేస్తుంది. ఇమ్యూనిటీ తక్కువున్న వాళ్లపై ఈజీగా దాడి చేస్తుంది” అని డాక్టర్ లాస్య సింధు చెప్పారు.



యాంటీబాడీలు ఫంగస్ ను అడ్డుకుంటాయా?
”లివర్, బోన్ మారో, కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ పేషెంట్స్ లో ఎక్కువగా ఈ కేసులు చూశాము. ఇలాంటి ట్రాన్స్ ప్లాంట్ జరిగిన పేషెంట్లకు ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తాము. ఆ కారణంగా బ్లాక్ ఫంగస్ అటాక్ చేస్తుంది. కోవిడ్ నుంచి కోలుకున్నాక యాంటీ బాడీలు వస్తాయి. కానీ, అవి..నెక్ట్స్ కరోనా రాకుండా అడ్డుకోవడానికి మాత్రమే ఉపయోగపడాయి. కానీ, అందరికి అదే స్థాయిలో యాంటీబాడీలు రావు. రీ ఇన్ ఫెక్షన్లు వచ్చే చాన్సుంది. యాంటీబాడీలకు, ఫంగస్ కు సంబంధం లేదు. యాంటీబాడీలు కోవిడ్ తో ఫైట్ చేయడం వరకే పరిమితం అవుతాయి” అని జనరల్ ఫిజీషియన్ వినూష రెడ్డి చెప్పారు.