Shreya Ghoshal : బాబు ఫస్ట్ పిక్ పోస్ట్ చేసిన శ్రేయా ఘోషల్..

తెలుగుతో పాటు పలు భాషల్లో తన మధురమైన గొంతుతో ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ పాడి ప్రేక్షకులను అలరిస్తున్న ‘మెలోడి క్వీన్’ శ్రేయా ఘోషల్ తల్లి అయ్యారు..

Shreya Ghoshal : బాబు ఫస్ట్ పిక్ పోస్ట్ చేసిన శ్రేయా ఘోషల్..

Shreya Ghoshal

Updated On : June 3, 2021 / 1:19 PM IST

Shreya Ghoshal: తెలుగుతో పాటు పలు భాషల్లో తన మధురమైన గొంతుతో ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ పాడి ప్రేక్షకులను అలరిస్తున్న ‘మెలోడి క్వీన్’ శ్రేయా ఘోషల్ తల్లి అయ్యారు.. కొద్దిరోజుల క్రితం తాను గర్భవతిగా ఉన్నానని చెబుతూ బేబీ బంప్‌తో ఉన్న పిక్ షేర్ చేశారామె.

 

View this post on Instagram

 

A post shared by shreyaghoshal (@shreyaghoshal)

త్వరలో మా జీవితంలోకి బేబీ శ్రేయా – ఆదిత్య ప్రవేశించనుందని, ఈ విషయాన్ని అందరితో షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ పోస్ట్ చేశారు. మే 22న శ్రేయా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. రీసెంట్‌గా బాబు మొట్టమొదటి ఫోటో షేర్ చేశారు శ్రేయా.

భర్త శైలాదిత్య ముఖోపాధ్యాయతో కలిసి తమ గారాలపట్టీని అపురూపంగా చూస్తున్న పిక్ పోస్ట్ చేస్తూ.. ‘‘దేవాన్ ముఖోపాద్యాయ’.. మే 22న వచ్చాడు.. మా జీవితాల్ని మార్చేశాడు.. తన పుట్టుకతో మా హృదయాల్లో ప్రేమ, కరుణ నింపేశాడు’’.. అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు శ్రేయా ఘోషల్.. ఆమె షేర్ చేసిన ఈ బ్యూటిఫుల్ పిక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ సందర్భంగా శ్రేయా ఘోషల్ దంపతులకు బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు, అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు..

 

View this post on Instagram

 

A post shared by shreyaghoshal (@shreyaghoshal)