Bombay HC : మంచంమీద పడుకున్న మహిళ పాదాలు తాకినా ఆమె గౌరవాన్ని, మర్యాదను కించపరిచినట్లే : హైకోర్టు వ్యాఖ్యలు

మంచంమీద పడుకున్న మహిళ పాదాలు తాకినా ఆమె గౌరవాన్ని, మర్యాదను కించపరిచినట్లేనని బాంబే హైకోర్టు ఓ కేసు విషయం కీలక వ్యాఖ్యలు చేసింది.

Sitting on woman’s cot in dead of night would amount to outraging modesty : మంచంమీద పడుకున్న మహిళ పాదాలు తాకినా ఆమె గౌరవాన్ని, మర్యాదను కించపరిచినట్లేనని ఓ కేసు విచారణలో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అర్ధరాత్రి వేళ ఒక మహిళ మంచం మీద కూర్చొని..ఆమె పాదాలను తాకడానికి ప్రయత్నించడం ఆమె మోడెస్టీని అంటే ఆమె గౌరవాన్ని..మర్యాదను కించపరినట్లేనని ఔరంగాబాద్‌లోని బాంబే హైకోర్టు బెంచ్ ఇటీవల ఓ కేసు విషయంలో తీర్పును వెలువరిస్తు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ అపరిచిత వ్యక్తి మహిళ శరీరంలోని ఏభాగాన్ని తాకినా..అది ఆమె మోడెస్టీని దెబ్బతీయడంతో సమానని పేర్కొంది.

Read more : Supreme Court : కారుణ్య నియామకం హక్కు కాదు..ఆటోమేటిక్ అంతకంటే కాదు : సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఈ కీలక వ్యాఖ్యల వెనుక ఉన్న ఉన్న కేసును పరిశీలిస్తే కోర్టు చేసిన వ్యాఖ్యలు అత్యంత క్షుణ్ణంగా పరిశీలించి చేసినవిగా అనిపిస్తుంది. జల్నా జిల్లాకు చెందిన పరమేశ్వర్ ధాగే అనే 36 ఏళ్ల వ్యక్తి తన పొరుగున ఉండే కుటుంబంలోని మహిళ విషయంలో వ్యవహరించిన తీరును ప్రతిబింభిస్తోంది. సదరు మహిళపై పక్కింటి వ్యక్తి వ్యవహరించిన తీరును..ఆ సయమాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది. అర్థరాత్రి సమయంలో ఆమె పడుకున్న మంచం వద్దకు వెళ్లి…వ్యవహరించిన తీరు ఏమాత్రం సరైంది కాదని..అది ఆమె గౌరవాన్ని, మర్యాదను కించపరిచినందుకు సదరు వ్యక్తిని దోషిగా నిర్దారిస్తూ కింది కోర్టు తీర్పునిచ్చింది. రెండేళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన పరమేశ్వర్ ధాగే కింద కోర్టు తీర్పును సవాలు చేస్తు.. ఔరంగాబాద్‌లోని బాంబే హైకోర్టు బెంచ్‌ను ఆశ్రయించాడు. అతడు దాఖలు చేసిన అప్పీల్‌ను జస్టిస్ ముకుంద్ సెవ్లికర్‌తో కూడిని ధర్మాసం విచారణ చేపట్టింది.

Read more : Skin to Skin contact :స్కిన్‌-టు-స్కిన్‌ కాంటాక్ట్ కేసు..దుస్తుల పైనుంచి తాకినా లైంగిక వేధింపే : స్పష్టం చేసిన సుప్రీం

ఈ కేసు విచారణలో ప్రాసిక్యూషన్ ప్రకారం..జూలై 2014లో పరమేశ్వర్ ధాగే ఓ రోజు సాయంత్రం సదరు మహిళ ఇంటికి వెళ్లి ‘నీ భర్త ఊరు వెళ్లాడు కదా?.ఎప్పుడు తిరిగి వస్తాడు? అని అడిగాడు. అందుకు ఆమె ‘నా భర్త ఈరోజు రారు..రేపు వస్తారు’’అని చెప్పింది.

ఈ తర్వాత పరమేశ్వర్ ధాగే తన ఇంటికి వెళ్లిపోయాడు. ఈతరువాత రాత్రి 11 గంటల సమయంలో సదరు పక్కింటి మహిళ ఇంటికి వెనుక గేటుగుండా లోపలికి వచ్చాడు. నెమ్మదిగా ఇంట్లోకి ప్రవేశించారు. ఆమె నిద్రపోతోందని గమనించాడు. ఆమె పడుకున్న రూమ్ లోపల నుంచి బోల్ట్ వేయలేదని గ్రహించి నెమ్మదిగా ఆమె పడుకున్న రూమ్ లోకి వచ్చాడు. ఆమె పడుకున్న మంచం మీద కూర్చుని.. నెమ్మదిగా పాదాలను పట్టుకున్నాడు. దాంతో ఆమె భయపడి లేచి కూర్చుంది. మంచం మీద పక్కింటి వ్యక్తి ఉండటం చూసి షాక్ అయ్యింది. కంగారుపడిపోయింది. పెద్దగా అరిచింది. ఆ అరుపులకు పరమేశ్వర్ వెళ్లిపోయాడు. దీంతో ఆమె ఇంటి తలుపులు బోల్ట్ వేసుకుని..భయం భయంగా ఆ రాత్రి అంతా గడిపింది.తరువాత భర్త వచ్చాక విషయం చెప్పింది. దీంతో భార్యభర్తలు కోర్టును ఆశ్రయించగా కోర్టు ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకుని ఇటువంటి కీలక వ్యాఖ్యలు చేసింది.

Read more : Supreme court :మాస్టారు మందలిస్తే అది విద్యార్ధి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదు : సుప్రీంకోర్టు

కానీ పరమేశ్వర్ మాత్రం ఆమెను మోడస్టీని కించపరిచే ఉద్దేశం తనకు లేదని కోర్టులో వాదించాడు. కానీ ఎటువంటి దురుద్ధేశం లేకపోతే రాత్రి సమయంలో..మా ఇంటికి రావాల్సిన అవసరం ఏంటీ అని..పడుకున్న రూమ్ లోకి వచ్చి మంచంమీద కూర్చోవటం ఏంటీ అంటూ బాధితురాలు వాదించింది. ఈ వివాదాన్ని పరిగణలోని తీసుకున్న ధర్మాసనం.. పరమేశ్వర్ ధాగే సదరు మహిళ యొక్క భావోద్వేగ స్థితిని దెబ్బతీసే సామర్థ్యాన్ని కలిగి ఉందని స్పష్టమవుతుందని అర్థం చేసుకుంది.

Read more : Breastfeeding Hight : తల్లిపాలు తాగటం చంటిబిడ్డకు..పాలు పట్టించటం తల్లికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు: హైకోర్టు కీలక తీర్పు

‘‘అతను ఆమె పాదాల వద్ద కూర్చున్నాడు. ఆమె పాదాలను తాకాడు. అతను లైంగిక ఉద్దేశంతో అక్కడికి వెళ్లాడని..బాధితురాలి మోడస్టీని దెబ్బతీశాడని ఇది స్పష్టంగా సూచిస్తుందని పేర్కొంది ధర్మాసనం. అందువల్ల,..ధాగే బాధితురాలిపై వేధింపులకు పాల్పడ్డాడని కింది కోర్టు చెప్పడంలో కింది కోర్టు ఎలాంటి తప్పులేదు’ అని బాంబే హైకోర్టు స్పష్టంచేసింది. రాత్రి సమయంలో బాధితురాలి ఇంట్లో ఏమి చేస్తున్నాడనే దానిపై ధాగే సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదని జస్టిస్ సెవ్లికర్ పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు