Breastfeeding Hight : తల్లిపాలు తాగటం చంటిబిడ్డకు..పాలు పట్టించటం తల్లికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు: హైకోర్టు కీలక తీర్పు

తల్లిపాలు తాగటం చంటిబిడ్డకు..పాలు పట్టించటం తల్లికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని కర్ణాటక హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.

Breastfeeding Hight : తల్లిపాలు తాగటం చంటిబిడ్డకు..పాలు పట్టించటం తల్లికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు: హైకోర్టు కీలక తీర్పు

Breastfeeding Hight

breastfeeding is inalienable constitutional right of a mother : పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ ఆకలితో ఏడిస్తే తల్లి మనస్సు అల్లాడిపోతుంది. ఎంత పనిలో ఉన్నా..ఆఖరికి తన కడుపు నింపుకోవటం కూడా మానేసి బిడ్డను గుండెలకు హత్తుకుని గుండెల్లోంచి పొంగుకొస్తున్న పాలామృతంతో బిడ్డ బుల్లిబొజ్జను నింపుతుంది తల్లి. కానీ గుండెల్లో పాలు పొంగుతున్నా..కన్నబిడ్డ పాలకోసం ఆకలితో గుక్కపట్టి ఏడుస్తున్నా పాలు ఇవ్వలేని పరిస్థితిలో తల్లి..తల్లిపాలు తాగలేని దుస్థితిలో బిడ్డ ఉంటే..? బిడ్డకు పాలు ఇవ్వాలనే తపన తల్లికి ఉన్నా..పాలు తాగే అవసరం బిడ్డకు ఉన్నా..అది సాధ్యం కాకపోతే..అప్పుడేం చేయాలి? అటువంటి పరిస్థితులకు కారణం ఎవరు? అనే విషయం పక్కన పెట్టి..రాజ్యాం కల్పించిన హక్కులతో బిడ్డ ఆకలి తీర్చే హక్కు తల్లికి ఉందని తేల్చి చెప్పింది కర్ణాటక హై కోర్టు.

గురువారం (సెప్టెంబర్ 30,2021) కన్నతల్లి-పెంపుడుతల్లి మధ్యలో నలిగిపోయిన ఓ చంటిబిడ్డ విషయంలో కర్ణాటక హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘చంటిబిడ్డలకు తమ రొమ్ముపాలు పట్టించడం తల్లులకు రాజ్యాంగ ఇచ్చిన హక్కు’’ అని జస్టిస్ కృష్ణ ఎస్. దీక్షిత్ నేతృత్వంలోని కర్ణాటక హై కోర్టు గురువారం ఓ కీలక తీర్పునిచ్చింది. బెంగళూరులోని ఓ ఆసుపత్రి నుంచి గత సంవత్సరం దొంగిలించబడిన తన బిడ్డను తనకు తిరిగి ఇప్పించాలని హుస్నాబాను అనే మహిళ హైకోర్టును ఆశ్రయించింది. తన బిడ్డను దొంగిలించినవారు అనుపమ దేశాయ్ అనే మహిళ కొనుక్కున్నదని ఆమె వద్ద నుంచి తన బిడ్డను తనకు ఇప్పించాలని హుస్నాబాను కోర్టును కోరింది.

Read more :Breast Feeding Week : తల్లిపాల వారోత్సవాలు 2021.. అమ్మపాలు బిడ్డకు రక్ష తల్లికి శ్రీరామ రక్ష

కానీ..నాకు బిడ్డలమీద ఆశతో ఆ బిడ్డను ఒక సంవత్సరం నుంచి పెంచుకుంటున్నానని..ఆ బిడ్డపై మమకారం పెంచుకున్నాను.ఆ బిడ్డను ఇవ్వలేను..వదిలి ఉండలేను దయచేసిన నా ఆవేదన అర్థం చేసుకోండి అంటూ ఆబిడ్డను నానుంచి దూరం చేవద్దని ఇది అన్యాయం అని కోర్టును కోరింది పెంపుడు తల్లియైన అనుపమ దేశాయ్.

కానీ తన తల్లి పాలు తాగడం అనేది ప్రతీ చంటిబిడ్డ ప్రాథమిక హక్కు..అలాగే బిడ్డలకు తన పాలు పట్టించటం ఆర్టికల్ 21 ప్రకారం తల్లులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఈ హక్కుని ఎవ్వరూ కాదనలేరు..అడ్డుకునే హక్కు కూడా ఎవ్వరికి లేదు అంటూ తేల్చి చెప్పింది హైకోర్టు. ఆ అధికారాన్ని తల్లికున్న అన్ని అధికారాలతో విడిదీయేలేమని కోర్టు వ్యాఖ్యానిచింది. ఒక నాగరిక సమాజంలో ఏ తప్పూ చేయని ఓ చంటిబిడ్డకు తన తల్లి పాలు అందకుండా ఇంత కాలం దూరం చేయడం దురదృష్టకరమని..ఇటువంటి ఘటనలు మన నాగరిక సమాజంలో మళ్లీ జరగకూడదని కోర్టు అభిప్రాయపడింది.

సంవత్సరం నుంచి ఆ బిడ్డతో తనకున్న అనుబంధాన్ని తెంచేయవద్దని పెంపుడు తల్లి అభ్యర్ధనను హైకోర్టు త్రోసిపుచ్చింది. పెంపుడు తల్లి అనుపమ దేశాయ్ విన్నపాన్ని తిరస్కరిస్తూ.. ‘పిలల్లు కన్నతల్లి మరియు పెంపుడు తల్లి మధ్య విభజించబడేందుకు ఒక వస్తువు కాదని’ వ్యాఖ్యానించింది. ఆ బిడ్డపై మొదటి అధికారం కన్నతల్లికే ఉందని..కాబట్టి ఆ బిడ్డ కన్నతల్లికే చెందుతుంది అని కోర్టు తీర్పునిచ్చింది. అలాగే పెంపుడు తల్లి ఆవేదనను కూడా ధర్మాసనం అర్థం చేసుకందని చెబుతు ఆ బిడ్డను అనుపమ దేశాయ్ అప్పుడప్పుడు వెళ్లి బిడ్డను చూడవచ్చిని కోర్టు తెలిపింది.

Read more : Afghan Crisis :తమను జైళ్లకు పంపిన మహిళా జడ్జిల కోసం గాలిస్తున్న తాలిబన్లు..ప్రాణభయంతో దాక్కున్న వందలమంది న్యాయమూర్తులు

కాగా సదరు చంటిబిడ్డను బెంగళూరులోని ఓ ఆసుపత్రి నుంచి ఆ హాస్పిటల్ డాక్టరే దొంగిలించి ఓ జంటకు అప్పగించాడు. ఆ జంట ఆ బిడ్డకు జీవ అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. అలా దాదాపు సంవత్సరం తరువాత తన బిడ్డ ఫలానా వారి వద్ద ఉన్నాడని తెలుసుకున్న కన్నతల్లి కోర్టును ఆశ్రయించింది హాస్పిటల్ నుంచి దొంగిలించిబడిన తన బిడ్డను తనకు ఇప్పించాలని.

దీంతో పెంపుడు తల్లికి నోటీసులు పంపించగా కోర్టుకు హాజరైన తల్లి తన బిడ్డ కోసం తపించిపోయింది. పెంపుడు తల్లి తరపు న్యాయవాది తన క్లైంట్ తరపున వాదిస్తు..‘జీవ తల్లికి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారని..పెంపుడు తల్లి అయిన తన క్లైంట్ కు పిల్లలు లేరని అందుకే ఆబిడ్డ తన క్లైంట్ కే చెందాలని కోరినా కోర్టు అంగీకరించలేదు. ఈ కేసు చాలా సున్నితమైనదని…కానీ రాజ్యాంగ ప్రకారమే తీర్పుఇవ్వాలని ఏదోక తల్లి ఆవేదన చెందకకుండా ఈ కేసు పరిష్కారం కాదని చెబుతు కన్నతల్లికే బిడ్డ చెందాలని..కానీ పెంపుడు తల్లి తన బిడ్డను చూసుకునే అవకాశాన్ని మాత్రమే కోర్టు కల్పించగలదని తేల్చి చెప్పింది కర్ణాటక హైకోర్టు.