Sonu Sood : ట్విట్టర్‌లో ‘రియల్ హీరో’ సెన్సేషన్..

సోనూ సూద్‌కు ఫ్యాన్స్, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరిగారు.. ఇప్పుడు సోనూ ట్విట్టర్‌లో మరో ఘనత సాధించారు..

Sonu Sood : ట్విట్టర్‌లో ‘రియల్ హీరో’ సెన్సేషన్..

Sonu Sood

Updated On : June 19, 2021 / 8:03 PM IST

Sonu Sood: కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్నవారిని, నేనున్నానంటూ ఆదుకుంటున్న సోనూ సూద్.. కరోనా రోగుల పాలిట ఆపద్భాందవుడిగా మారారు. చిన్నదో, పెద్దదో.. సాయం కోరితే చాలు.. క్షణాల్లో సాయం అందిస్తూ ఎంతోమంది ప్రాణాలు నిలబెడుతున్నారు. కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అందక, మందులు దొరక్క.. బెడ్స్ అందుబాటులో లేక అల్లాడిపోతున్నారు.

Sonu Sood : ‘దేశం మెచ్చిన మొనగాడు’.. సోనూ సూద్‌తో 10 టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

ఇలాంటి సమయంలో వారికి అండగా సోనూ ఒక్కరే సైనికుడిలా నిలబడ్డారు. ఆయన నుండి సాయం పొందినవారు కృతజ్ఞతగా గుళ్లు కట్టి, పాలాభిషేకాలు చేస్తున్నారు. గతేడాది లాక్‌డౌన్ నుండి ఇప్పటివరకు విరామం లేకుండా, ఆయన చేతికి ఎముకలేదేమో అన్నంతగా సాయమందిస్తూనే ఉన్నారు.

Sonu Sood : పేద విద్యార్థులకు అండగా రియల్ హీరో..

అప్పటినుండి సోనూ సూద్‌కు ఫ్యాన్స్, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరిగారు. ఇప్పుడు సోనూ ట్విట్టర్‌లో మరో ఘనత సాధించారు. సోనూ సూద్ ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 8 మిలియన్ల మార్క్‌ను క్రాస్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 11.8 మిలియన్ల మంది ఆయణ్ణి ఫాలో అవుతున్నారు.