Superstar Krishna Last Rites: అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు ప్రారంభం

సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోస్ నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానంకు అంతిమయాత్రగా తరలించారు. మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మహాప్రస్థానంకు అభిమానులు కూడా భారీగా చేరుకున్నారు.

Superstar Krishna Last Rites: అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు ప్రారంభం

krishna last rites

Updated On : November 16, 2022 / 4:05 PM IST

Superstar Krishna Last Rites: సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోస్ నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానంకు అంతిమయాత్రగా తరలించారు. కృష్ణ గారికి తమ ఘన నివాళులర్పించేందుకు పద్మాలయ స్టూడియోకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరుకావడం, అభిమానుల తాకిడితో పద్మాలయ స్టూడియో కిక్కిరిసిపోయింది. తమ అభిమాన నటుడిని కడసారి చూసి వారు భాగోద్వానికి గురయ్యారు.

Krishna : చివరిసారిగా తాతయ్యకి నివాళ్లు అర్పించిన గౌతమ్ అండ్ సితార..

తాజాగా పద్మాలయ స్టూడియో నుంచి మహాప్రస్థానంకు కృష్ణ అంతిమయాత్ర పూర్తయ్యింది. ఈ అంతిమయాత్రలో టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకాగా, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణపై తమకున్న ప్రేమను వారు నెమరేసుకుంటూ ఈ అంతిమయాత్రలో పాల్గొన్నారు. మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మహాప్రస్థానంకు అభిమానులు కూడా భారీగా చేరుకున్నారు.

Super Star Krishna : పద్మాలయ స్టూడియోకి కృష్ణ భౌతికకాయం.. భారీగా తరలి వచ్చిన అభిమానులు..

మహాప్రస్థానంకు కృష్ణ భౌతికకాయం చేరుకోగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో, పోలీసుల గౌరవ వందనాల మధ్య కృష్ణ అంత్యక్రియలు సాగుతున్నాయి. తమ అభిమాన హీరో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు భారీగా మహాప్రస్థానంకు చేరుకున్నారు.