మేకప్ మ్యాన్ దగ్గర అప్పు తీసుకున్న నటి

‘కూర్చొని తింటే కొండలు అయినా కరిగిపోతాయ్’ అన్నట్లుంది పరిస్థితి ఈ లాక్‌డౌన్ పుణ్యమా అని. కోట్లకు పడగెత్తిన వారి పరిస్థితి ఏమో కానీ, చిన్నాచితక ఆర్టిస్టులకు చేయిజాచడం తప్పడం లేదు. లాక్‌డౌన్ అని చెప్పి మెయింటైనెన్స్ ఆగదు కదా.. రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటున్న టీవీ ఆర్టిస్టుకు అవే సమస్యలు వచ్చి పడ్డాయి. చేసేది లేక మేకప్ మ్యాన్ దగ్గర ఓ రూ.15వేలు కావాలంటూ అప్పు తీసుకుందంట.
‘ఇవాళ వచ్చే నెల ఖర్చులకు సరిపడ డబ్బులు లేవని మేకప్ మ్యాన్ దగ్గర అప్పు తీసుకున్నాను. ఓ ప్రొడ్యూసర్ టైంకు మనీ ఇవ్వలేదు. చాలా రోజుల నుంచి అడుగుతున్నా పట్టించుకోలేదు. ఓ మేకప్ మ్యాన్ కు విషయం చెప్పాను. అతని భార్య గర్భిణీ. అయినా నా పరిస్థితి అర్థం చేసుకుని సాయం చేస్తానన్నాడు. అతను పంపిన మెసేజ్ చూసి నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి
‘మేడమ్ నా దగ్గర రూ.15వేలు ఉన్నాయి. ఇప్పుడు మీకు కావాలంటే తీసుకోండి. గర్భిణీ అయిన నా భార్య డెలివరీ సమయానికి ఇచ్చేస్తే చాలు. నా వల్ల లక్షల లాభం గడించిన వాళ్లు నా ఫోన్ ఆన్సర్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. కాల్స్ బ్లాక్ చేసి నేను పనిచేసిన దానికి కూడా డబ్బులివ్వలేదు. నా మేకప్ మ్యాన్ పంకజ్ గుప్తా ఓ ఫ్యామిలీ మెంబర్ లా సాయం చేశాడు’
‘అతను డబ్బులు ఇస్తాననడం పెద్ద విషయం కాదు. అతని దగ్గర అన్ని డబ్బులు లేకపోయినా నా గురించి ఆలోచించాడు. మనస్సుతోనూ ప్రజలు ఎంత ఉన్నతంగా ఉండగలరో తెలుసుకునే టైం వచ్చింది’ అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టి వెల్లడించింది.
Read Here>> ఆనాటి ‘మిస్ ఇండియా’ సుందరీమణుల ఫొటోలు చూశారా?