MLC Counting Center : నల్గొండలో ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత : బ్యాలెట్‌ బాక్స్‌ల తాళాలు పగలగొట్టడంపై ఏజెంట్ల అభ్యంతరం

నల్గొండలో ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. కౌంటింగ్‌ కేంద్రం దగ్గర ఏజెంట్లు ఆందోళనకు దిగారు.

MLC Counting Center : నల్గొండలో ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత : బ్యాలెట్‌ బాక్స్‌ల తాళాలు పగలగొట్టడంపై ఏజెంట్ల అభ్యంతరం

Mlc Counting Center

Updated On : March 17, 2021 / 1:43 PM IST

Tension near mlc Counting Center : నల్గొండలో ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. కౌంటింగ్‌ కేంద్రం దగ్గర ఏజెంట్లు ఆందోళనకు దిగారు. బ్యాలెట్‌ బాక్స్‌ల తాళాలు పగలగొట్టడంపై ఏజెంట్లు అభ్యంతరం తెలుపుతున్నారు. కొన్ని బాక్స్‌ల సీల్ ముందే తొలగించారని ఆరోపించారు.

నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ .. నల్గొండలోని స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గోదాములో కట్టుదిట్టమైన భద్రత నడుమ కొనసాగుతోంది. 3.88 లక్షల మంది ఓటు హక్క వినియోగించుకున్నారు. దీంతో 731 పోలింగ్‌ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్‌ బాక్సుల ఓట్ల లెక్కింపు కోసం 8 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బ్యాలెట్‌ బైండింగ్‌ చేసే కార్యక్రమం జరుగుతోంది. వాలీడ్‌, ఇన్‌వాలీడ్‌ ఓట్లు వేరు చేసిన తర్వాత .. గెలుపు కోటా నిర్ణయిస్తామని రిటర్నింగ్‌ అధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ తెలిపారు.

తెలంగాణలో ఈనెల 14న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సరూర్‌నగర్‌ స్టేడియంలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇక వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ స్థానం ఓట్ల లెక్కింపు నల్లగొండలోని గిడ్డంగుల సంస్థ గోదాం హాళ్లలో జరుగుతోంది. రేపు లేదా ఎల్లుండి ఫలితాలు వెలువడే అవకాశముంది.