Pilot jumps off plane: ల్యాండ్ అవుతున్న విమానం నుంచి దూకిన పైలట్..

విమానం ల్యాండ్ అయ్యే సమయంలో యువ పైలట్ అనుమానాస్పద స్థితిలో కిందకు దూకి మరణించాడు. మరికొద్దిసేపట్లో విమానం టేకాఫ్ అవుతుందనుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Pilot jumps off plane: ల్యాండ్ అవుతున్న విమానం నుంచి దూకిన పైలట్..

Pilot

Updated On : July 31, 2022 / 7:46 PM IST

Pilot jumps off plane: విమానం ల్యాండ్ అయ్యే సమయంలో యువ పైలట్ అనుమానాస్పద స్థితిలో కిందకు దూకి మరణించాడు. మరికొద్దిసేపట్లో విమానం టేకాఫ్ అవుతుందనుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పక్కనే ఉన్న కో పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. అయితే అతనికిసైతం తీవ్ర గాయాలు కావటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ప్లైట్ నుంచి కిందకు దూకిన వ్యక్తికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. స్థానికంగా ఉండే అటవీ ప్రాంతంలో చెట్లపై వేలాడుతూ మృతదేహం కనిపించింది.

Pilot loses Cool: రన్‌వే‌పైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!

ఈ విమానం రామ్ పార్ట్ ఏవియేషన్ సంస్థకు చెందినది. అయితే ఈ ఘటనపై రామ్ స్టార్ ఏవియేషన్ ఇంకా స్పందించలేదు. పైలట్ మృతికి గల కారణాలేంటో తేల్చేందుకు నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేప్టీ బోర్డు దర్యాప్తు ప్రారంభించింది. మరణించిన పైలట్ ను చార్ల్స్ హ్యూ కుక్ గా అధికారులు గుర్తించారు. రాల్యీ డర్హమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ విమానం కుడివైపున ఉన్న చక్రం ఊడిపోవటంతో ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దిగిపోవాల్సి వచ్చింది. కిందకు దూకిన పైలెట్ ఎయిర్ పోర్టుకు 30మైళ్ల దూరంలో చెట్లపై వేలాడుతూ కనిపించాడు.

SpiceJet Pilots : 90మంది స్పైస్‌జెట్ పైలట్లపై వేటు.. ఎందుకో తెలుసా?

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైలట్ ప్రమాదం జరుగుతుందని భావించి ప్యారాచూట్ సహాయంతో కిందికి దూకేందుకు ప్రయత్నించి ఉంటాడా అనే అనుమానం వ్యక్తమవుతుంది. గాయాలతో బయటపడ్డ కో పైలట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఛార్ల్స్ కుక్ మరణంతో అతడి కుటుంబం శోకసంద్రంలో కూరుకుపోయింది. పైలట్ అవ్వాలని కలలు కన్న ఛార్ల్స్ ప్రాణాలు కోల్పోవడంతో అతడి కుుటంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.