SpiceJet Pilots : 90మంది స్పైస్‌జెట్ పైలట్లపై వేటు.. ఎందుకో తెలుసా?

SpiceJet Pilots : ఇండియన్ ఏవియేషన్ రెగ్యులేటర్ డైర‌క్టరేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. స్పైస్‌జెట్‌లో ప‌నిచేస్తున్న 90 మంది పైలట్లపై వేటు వేసింది.

SpiceJet Pilots : 90మంది స్పైస్‌జెట్ పైలట్లపై వేటు.. ఎందుకో తెలుసా?

Dgca Bars 90 Spicejet Pilots From Operating Boeing 737 Max Aircraft

SpiceJet Pilots : ఇండియన్ ఏవియేషన్ రెగ్యులేటర్ (DGCA) డైర‌క్టరేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. స్పైస్‌జెట్ సంస్థలో ప‌నిచేస్తున్న 90 మంది పైలట్లపై వేటు వేసింది. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు న‌డుపుతున్న పైలెట్లపై నిషేధం విధిస్తున్నట్టు వెల్లడించింది. మ్యాక్స్ విమానాలను నడిపే స్పైస్ జెట్ పైలట్లు స‌రైన రీతిలో శిక్షణ పొంద‌లేద‌నే కారణంతో వారిపై వేటు వేసినట్టు తెలిపింది. అయితే, వారంతా మ‌ళ్లీ శిక్షణ తీసుకుని విధుల్లో చేరాలని డీజీసీఏ ఆదేశాల్లో పేర్కొంది.

పైలట్లు పూర్తిస్థాయిలో మ్యాక్స్ విమానాల శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాతే పైలట్లు విధుల్లో చేరుతార‌ని DGCA చీఫ్ అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ లేకుండానే పైలట్లుగా మ్యాక్స్ విమానాలను నడుపుతున్నారనే విషయం ప్రయాణికుల్లో ఆందోళనలను రేకిత్తించింది. శిక్షణ పూర్తి కాకుండానే ఈ పైలట్లను మ్యాక్స్ విమానాలను నడపడానికి బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మ్యాక్స్ సిమ్యులేటర్‌పై ఈ పైలట్లు మళ్లీ సరైన మార్గంలో శిక్షణ పొందుతారని తెలిపారు.

బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు భారత్‌లో 2019 మార్చి 13న అడుగుపెట్టాయి. ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను అడిస్ అబాబా వద్ద కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు భారతీయులు సహా 157 మంది దుర్మరణం చెందారు. అయితే అదే సమయంలో ఈ మ్యాక్స్ విమానాలను DGCA ఇండియాకు తీసుకొచ్చింది. ఆ వెంటనే మ్యాక్స్ విమానాలపై ఇండియాలో డీజీసీఏ నిషేధం విధించింది. గతేడాది ఆగస్టులోనే ఈ నిషేధాన్ని ఎత్తేసింది. అమెరికా సంస్థ బోయింగ్ ఈ మ్యాక్స్ విమానాల్లో అవసరమైన సాఫ్ట్‌వేర్ మార్పులు చేసి లోపాలను సవరించిన తర్వాత డీజీసీఏ నిషేధం ఎత్తేసింది.

మ్యాక్స్ విమానం నడిపే పైలట్లు సిమ్యులేటర్‌పై సరైన శిక్షణ పొందినవారినే నియమించాలనే షరతు విధించింది. ఈ క్రమంలోనే స్పైస్‌జెట్ పైలట్లపై డీజీసీఏ ఆంక్షలు విధించింది. మొత్తం స్పైస్‌జెట్‌లో మ్యాక్స్ విమానంపై శిక్షణ పొందిన పైలట్లు 650 మంది ఉన్నారు. వారిలో 90 మంది పైలట్ల శిక్షణ తీసుకున్న విధానం సరైన పద్ధతిలో లేదని డీజీసీఏ గుర్తించింది.

Read Also : SpiceJet: ATC అనుమతి లేకుండా విమానాన్ని నడిపిన స్పైస్‌జెట్ పైలట్‌!