SpiceJet: ATC అనుమతి లేకుండా విమానాన్ని నడిపిన స్పైస్‌జెట్ పైలట్!
స్పైస్‌జెట్ పైలట్ ATC నుండి అనుమతి తీసుకోకుండా రాజ్‌కోట్ నుండి ఢిల్లీకి ప్రయాణించినట్లుగా ఆరోపణలు వచ్చిన తర్వాత పైలట్‌ను విధుల నుంచి తొలగించింది స్పైస్‌జెట్.
SpiceJet: స్పైస్‌జెట్ పైలట్ ATC నుండి అనుమతి తీసుకోకుండా రాజ్‌కోట్ నుండి ఢిల్లీకి ప్రయాణించినట్లుగా ఆరోపణలు వచ్చిన తర్వాత పైలట్‌ను విధుల నుంచి తొలగించింది స్పైస్‌జెట్. అయితే ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది.
రాజ్‌కోట్ నుంచి ఢిల్లీకి విమానం:
స్పైస్‌జెట్ విమానం నంబర్ SG3703ని నడిపేందుకు డ్యూటీలో ఉన్నాడు ఓ పైలట్. స్పైస్‌జెట్ విమానం డిసెంబర్ 30న రాజ్‌కోట్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. అయితే ఈ విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అనుమతి ఇవ్వలేదు. అంటే క్లియరెన్స్ రాకుండానే పైలట్ విమానాన్ని నడిపాడు.
స్పైస్‌జెట్ స్పందన:
ఈ విషయమై స్పైస్‌జెట్ మాట్లాడుతూ.. విచారణ ఇంకా కొనసాగుతోందని, పైలట్ తప్పిదమా? లేక ఏటీసీ తప్పిదమా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు అధికారులు. క్లియరెన్స్ ఇవ్వడం.. లేదా తీసుకోవడంలో ATC ఏదైనా పొరపాటు చేస్తే, లేదా ఏదైనా సాంకేతిక సమస్య ఉందని వెల్లడైతే, స్పైస్‌జెట్ ఈ విషయంలో ఏం చర్యలు తీసుకున్నా అంగీకరిస్తుందని వెల్లడించింది.
పెద్ద ప్రమాదం జరిగి ఉండొచ్చు:
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి పొందిన తర్వాత మాత్రమే విమానాన్ని రన్‌వే నుండి టేకాఫ్ లేదా ల్యాండింగ్ చేస్తారు. దీని కోసం, పైలట్ ATC నుండి అనుమతి తీసుకోవాలి, అప్పుడు మాత్రమే విమానాన్ని ప్రధాన రన్‌వేపైకి తీసుకువస్తారు. అలా జరగనప్పుడు.. అదే సమయంలో విమానం ల్యాండింగ్ అయినా.. టేకాఫ్ అయినా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది.