South Roundup : ఈ వారం సౌత్ రౌండప్.. ట్రెండింగ్‌లో నిలిచిన సినిమాలు..

South Roundup : ఈ వారం సౌత్ రౌండప్..  ట్రెండింగ్‌లో నిలిచిన సినిమాలు..

South Roundup

Updated On : March 27, 2021 / 8:16 PM IST

South Roundup : ఈ వీక్ సౌత్ రౌండప్‌లో ఇంట్రెస్టింగ్ న్యూస్ ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా నేషనల్ అవార్డ్స్ హాట్ టాపిక్‌గా మారాయి. తెలుగులో ‘మహర్షి’, ‘జెర్సీ’ సినిమాలు చెరో రెండు అవార్డులు దక్కించుకోగా.. తమిళ్‌లో ‘అసురన్’ సినిమాకి గానూ జాతీయ ఉత్తమ నటుడిగా ధనుష్, ‘సూపర్ డీలక్స్’ సినిమాలోని అద్భుత నటనకు విజయ్ సేతుపతి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్‌ను గెలుపొందారు.

Maharshi

Jersey

రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ కోసం తెలుగు నేర్చుకుంటోంది కృతి సనన్. ఈ సినిమాలో సీతగా నటిస్తోన్న కృతి, ఇప్పటికే సీత హావభావాలను ప్రాక్టీస్ చేస్తోంది. కాగా ఇప్పుడు పూర్తిగా తెలుగు నేర్చుకునేందుకు రెడీఅయింది. దీనికోసం ఆల్రెడీ ఓ తెలుగు ట్యూటర్‌ని కూడా నియమించుకుంది కృతి సనన్.

Adipurush

ఒకప్పటి స్టార్ హీరోయిన్.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’ ట్రైలర్ రిలీజైంది. అమ్మగా కంగనా నటన అద్భుతమంటూ ప్రశంసిస్తున్నారు ప్రేక్షకులు. అరవింద్ స్వామి, ఎంజీర్ గా నటించగా, ఆయన భార్య జానకిగా మధుబాల కనిపించారు. కానీ జయలలిత జీవితంలో ముఖ్యులైన శశికళ, శోభన్ బాబు, కరుణానిధి వంటి వారిని ఈ ట్రైలర్‌లో చూపించలేదు. దీంతో సినిమాపై మరింత ఆసక్తిపెరిగిందంటున్నారు సినీ వర్గాలవారు.

Thalaivi

కంప్లీట్ యాక్టర్ మోహన్‌ లాల్‌ మెగాఫోన్‌ పట్టి డైరెక్టర్‌గా మారారు. మోహన్‌ లాల్‌ డైరెక్ట్ చేస్తోన్న ‘బరోజ్‌’ సినిమా ప్రారంభోత్సవం కొచ్చిలో జరిగింది. మలయాళ డైరెక్టర్, యాక్టర్ జిజో పున్నూస్‌ రచించిన ‘బరోజ్‌: గార్డియన్‌ఆఫ్‌డీ గామా ట్రెజర్‌’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

Barroz