Beggar Death Viral : యాచకుడి అంతిమ‌యాత్ర‌కు వేలాదిగా తరలివచ్చిన ప్రజలు..ఘనంగా అంతిమ వీడ్కోలు

ఓ యాచకుడి అంతిమ‌యాత్ర‌కు వేలాదిగా తరలివచ్చిన ప్రజలు..ఘనంగా అంతిమ వీడ్కోలు పలికారు.

Karnataka Beggar Death: భిక్షమొత్తుకుని జీవించేవారిని ఎవ్వరు పట్టించుకోరు. వారి చనిపోయినా ఎవ్వరు కన్నెత్తి కూడా చూడరు. రెండు కన్నీటి చుక్కలు కార్చేవారు కూడా ఉండరు. అయ్యో చనిపోయాడమ్మా అని సానుభూతి చూసేవారు ఉండరు. చనిపోతే ఏ మున్సిపల్ వారో మృతదేహాన్ని చెత్తవ్యాన్ లో తరలించేస్తారు. కానీ క‌ర్ణాట‌క‌లో ఓ భిక్షగాడు చనిపోతే ఊరు ఊరంతా ఏడ్చింది.అతని అంతిమ యాత్రకు జనాలు భారీగా తరలివచ్చారు. ఘనంగా నివాళులు అర్పించారు.పైగా ఆ భిక్షగాడు దివ్యాంగుడు కూడా. అతని మరణం జనాలను కదలించివేసింది. కన్నీటి వీడ్కోలు పలికారు. ఏ భిక్షగాళ్లకు దక్కని ఘనమైన అంతిమయాత్ర జరిగింది ఆ దివ్యాంగ భిక్షగాడి విషయంలో.ఆ విశేషం గురించి..

Read more : Beggars InCome : ఈ బిచ్చగాళ్లు సంపాదన మామూలుగా లేదుగా..ఉద్యోగుల ఆదాయం వీళ్లముందు బలాదూర్

క‌ర్ణాట‌క‌లోని విజ‌య‌న‌గ‌ర జిల్లాలోని హ‌విన‌హ‌డ‌గ‌లిలో హుచ్చ‌బ‌స్య‌ అనే యాచ‌కుడు కన్నుమూశాడు. అతని మృతిని తెలుసుకున్న హవినహడగలి జనం కన్నీరుమున్నీరుగా విలపించారు. అతని మరణం వారిని శోక సంద్రంలో ముంచేసింది. భిక్షగాడు హచ్చబస్య అంతిమయాత్రను ఎంతో ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నారు హవినహడగలి ప్రజలు. అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశారు.పూలతో అలంకరించారు. పెద్ద ఎత్తున ఊరేగింపుకు భారీగా తరలివచ్చి మరీ..అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ అంతిమ సంస్కారంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. హుచ్చ‌బ‌స్య‌ గురించి ప్రజలు ఎందుకంతగా విలపించారంటే..

హుచ్చ‌బ‌స్య‌ ప‌ట్ట‌ణంలో ఎన్నో ఏళ్లుగా నివ‌శిస్తున్నాడు. దివ్యాంగుడైన హుచ్చ‌బ‌స్య‌ ప‌ట్ట‌ణంలో ప్ర‌తి ఒక్క‌రికి బాగా తెలిసినవాడే. అంద‌ర్ని ఆప్యాయంగా పలుకరించేవాడు. ఓ భిక్షగాడు అలా పలకరిస్తుంటే మొదట్లో అందరు వింతగా చూసేవారు. తరువాత అలా పలకరిస్తుంటే అతని విషయంలో అందరికి సదభిప్రాయం కలిగింది. అలా ప‌ల‌క‌ల‌రిస్తూ కేవలం రూపాయి మాత్ర‌మే యాచించి తీసుకునేవాడు. అంత‌కంటే ఎక్కువ ఇచ్చినా తీసుకునేవాడు కాదు. వద్దయ్యా రూపాయే చాలు అనేవాడు.అలా అతని పట్ల క్రమేపీ అభిమానం పెరిగింది.

Read more : Skin to Skin contact :స్కిన్‌-టు-స్కిన్‌ కాంటాక్స్ కేసు..దుస్తుల పైనుంచి తాకినా లైంగిక వేధింపే : స్పష్టం చేసిన సుప్రీం

సాధారణంగా బిచ్చగాళ్లు కనిపిస్తే చూసీ చూడనట్లుగా వెళ్లిపోతాం.భిక్ష అడిగినా వినిపించనట్లే వెళ్లిపోతాం. కానీ హుచ్చబస్య కనిపిస్తే ఎవరైనా సరే రూపాయి ఇచ్చే వెళతారు. అలా రూపాయి ఇచ్చినవారిని ఇవ్వని వారిని కూడా ముచ్చబస్య ప్రేమగా పలకరించేవాడు. అలా భిక్షగాడు హచ్చబస్య అందరికి అలవాటు అయిపోయాడు. అంతమంచి వాడైన హుచ్చబస్యకు రూపాయి ధ‌ర్మం చేయ‌డం వ‌ల‌న మంచి జరుగుతుందనుకునేవారు ప్రజలు. అందుకే హ‌చ్చ‌బ‌స్య క‌నిపిస్తే రూపాయి ఇచ్చేసేవారు స్థానిక ప్ర‌జ‌లు.పగలంతా భిక్షమెత్తుకును హుచ్చబస్య దేవాలయాలు, స్కూళ్లు వంటిచోట తలదాచుకనేవాడు. అక్కడే పడుకునేవాడు. అలా జీవిస్తు పట్టణ ప్రజల అభిమానాన్ని చూరగొన్న హుచ్చబస్య రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతు..చనిపోయాడు. అతని మరణం స్థానికుల్ని కదిలించివేసింది. ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు.

సాధారణ ప్రజలే కాదు ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధులు ఎవ‌రు క‌నిపించినా పేరుపెట్టి పిలిచి రూపాయి ధ‌ర్మం అడిగి తీసుకునేవాడు హ‌చ్చ‌బ‌స్య‌. ఆయ‌న్ను అక్క‌డ అంతా అదృష్ట బ‌స్య అని పిలుచుకునేవారు. ఒక బిచ్చగాడు మరణంలో అశేషమైన జనాన్ని సంపాదించుకోవడం చర్చనీయాంశమైంది. యాచకుడు హుచ్చబస్య మరణాన్ని ఊరంతా సొంతం చేసుకుంది. అతని అంతిమయాత్రలో అడుగులో అడుగై నడిచింది. అతని అమాయకపు నవ్వును గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకుంది. అతన్ని గుండెల్లో పెట్టుకుని ఘనంగా వీడ్కోలు పలికింది.

Read more : NIA Raids in Telugu States : మావోయిస్టు సానుభూతిపరులే టార్గెట్ గా తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు

ప్రతీ మనిషికి పుట్టుక తొలి ఘట్టమైతే అంతిమ సంస్కారం..చివరి ఘట్టం. అతి ముఖ్యమైన ఘట్టం. మన పుట్టుక ఎలా ఉన్నా..ఎలా జీవించినా..ఎలా బ్రతికాం అన్నది కాదు.. చివరి శ్వాస వదిలేసినప్పుడే ఆ మనిషి విలువ తెలుస్తుంది. చనిపోయిన మనిషి ఎంత దుర్మార్గుడైనా అయ్యో చనిపోయాడా? అంటారు. చావుకు పేదా గొప్పా తేడా లేదు. అందరని ఒకేలా పలకరించేదా చావు ఒక్కటే. ఇది ప్రకృతి ధర్మం. దనవంతులకు అంతిమ వీడ్కోలు ఘనంగా జరిగితే బీద వారు సాధారణంగా జరగవచచ్చు. వారి వారి స్థాయికి తగినట్లే తుది ఘట్టం పూర్తి అవుతుంది. కానీ భిక్షగాడు హుచ్చబస్య విషయంలో మాత్రం తుది ఘట్టం అత్యంత ఘనంగా జరిగింది. బహుశా ఈ ప్రపంచంలో ఏ భిక్షగాడు హుచ్చబస్యకు దక్కిన ఈ ఘన వీడ్కోలు దక్కి ఉండదేమో. నిజంగా ఎలా బతికాం అనేది కాదు ముఖ్యం చనిపోయాక అతని మరణం ఎంతగా బాధించింది అనేది ముఖ్యమని నిరూపించాడు భిక్షగాడు హుచ్చబస్య..

ట్రెండింగ్ వార్తలు