Beggars InCome : ఈ బిచ్చగాళ్లు సంపాదన మామూలుగా లేదుగా..ఉద్యోగుల ఆదాయం వీళ్లముందు బలాదూర్

ఎక్కడన్నా భిక్షగాళ్లు కనిపిస్తే ఓ రూపాయి అయినా వేయాలనిపిస్తుంది.కానీ భిక్షగాళ్లంతా తిండి లేక..ఉండటానికి ఇల్లు లేక అడుక్కుంటున్నారని అనుకోవద్దు. చాలామంది భిక్షగాళ్లు లక్షాధికారులు కోటీశ్వరులు అంటూ ఆశ్చర్యపోనక్కరలేదు. అలా ఇండియాలో ఉండే ముగ్గురు టాప్ మోస్టు భిక్షగాళ్లు ఆస్తుల గురించి తెలిస్తే నోరెళ్లబెట్టక తప్పదు. వీరి సంపాదన ముందు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కూడా బలాదూర్ అనిపిస్తుంది.

10TV Telugu News

3 rich beggars in india : ఎక్కడన్నా భిక్షగాళ్లు కనిపిస్తే ఓ రూపాయి అయినా వేయాలనిపిస్తుంది.కానీ భిక్షగాళ్లంతా తిండి లేక..ఉండటానికి ఇల్లు లేక అడుక్కుంటున్నారని అనుకోవద్దు. చాలామంది భిక్షగాళ్లు లక్షాధికారులు కోటీశ్వరులు అంటూ ఆశ్చర్యపోనక్కరలేదు. అలా ఇండియాలో ఉండే ముగ్గురు టాప్ మోస్టు భిక్షగాళ్లు ఆస్తుల గురించి తెలిస్తే నోరెళ్లబెట్టక తప్పదు. వీరి సంపాదన ముందు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కూడా బలాదూర్ అనిపిస్తుంది.సిగ్నల్స్,బస్టాండ్స్, రైల్వేస్టేషన్స్, గుడులు, ఫుట్ పాత్ లు ఇలా చాలా ప్రాంతాల్లో భిక్షగాళ్లని చూస్తుంటాం. వారేదో తిండి లేక..పొట్టకూటి కోసం అడుక్కుంటున్నారని అనుకుంటే పొరపాటే. వారికి బ్యాంకుల్లో ఐదారు..ఏడు అంకెల్లో బ్యాలెన్స్ ఉంటుంది. సొంత ఇళ్లుంటాయి. అవేవో సాధాసీదా ఇళ్లు కాదు. చాలా క్లాస్ గా ఉంటాయి. సినిమాల్లో ఇళ్లను తలపించేలా కూడా ఉంటాయి.ఇంత ఆస్తి ఉన్నాగానీ వాళ్లు చాచించాడాన్ని వృత్తిగా మార్చుకున్నారు. అటువంటి భిక్షగాళ్ల సంపాదన గురించి తెలిస్తే షాక్ అవుతాం. అడుక్కుంటూ ఇంత సంపాదించారా? మంచి ఉద్యోగం చేసినా ఇంత సంపాదించలేం కదా..ఇదేదో బాగుందే కష్టపడకుండా..పైసా పెట్టుబడి లేకుండా ఇలా లక్షలు కోట్ల రూపాయలు సంపాదించటం అని అనుకోక తప్పదు కొంతమంది భిక్షగాళ్ల గురించి తెలిస్తే..అలా భారతదేశంలో ముగ్గురు బిచ్చగాళ్ల గురించి తెలుసుకుందాం.

భారతదేశపు ధనవంతులైన బిచ్చగాళ్ల గురించి తెలుసుకుంటే అందరు షాక్ అయి తీరతాం.అవుతారు. వీరికి ధనవంతులలాగే అన్ని సౌకర్యాలు ఉంటాయి. సౌకర్యాలు అని చిన్నమాట అనలేం లగ్జరీ అనొచ్చు. పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటాయి. అయినా వారు ఇప్పటికే అడుక్కోవటం మాత్రం మానరు. దర్జాగా ఉండాలని అస్సలు అనుకోరు.అటువంటివారిలో భారత్ లోని ధనిక బిచ్చగాళ్ల లిస్టులో మొదటి పేరు భారత్ జైన్. ఇతడు ఎక్కువగా ముంబైలోని పరేల్ ప్రాంతంలో యాచిస్తుంటాడు.ఓ నివేదిక ప్రకారం ఇతనికి రెండు ఫ్లాట్లు ఉన్నాయి. వీటి విలువ రూ.70 లక్షలు. అయినా అడుక్కోవటం మానడు.అలా అడుక్కుంటూ నెలకు 75,000 సంపాదిస్తాడు.అలా ప్రతీ నెలా రూ.75 వేలకు తగ్గదు అతని సంపాదన.

మరో ధనిక బిచ్చగాళ్ల లిస్టులో రెండో భిక్షగత్తె కోల్‌కతాలో నివసించే లక్ష్మి. 1964 నుంచి అంటే ఆమెకు 16 ఏళ్ల వయసునుంచే కోల్‌కతా నగరంలో అడుక్కుంటోంది. అలా ఆమెకు అడుక్కోవటంలో 50 సంవత్సరాల ఎక్స్ పీరియన్స్ ఉంది. అలా భిక్షాటన ద్వారా లక్షల రూపాయలు వెనకేసింది. అయినా ఆమె అడుక్కోవటం మానదు.ఈనాటికీ లక్ష్మి అడుక్కుంటునే ఉంది. అలా ఆమె రోజుకు రూ.1000 సంపాదిస్తుంది. అంటే నెలకు రూ.30 వేలు. ఒక్కోరోజు పెరుగుతుంది కూడా.అలాగే మూడో భిచ్చగత్తె. ముంబైలో నివసిస్తున్న గీత. ముంబైలోని చార్ని రోడ్ వద్ద గీత భిక్షాటన చేస్తుంది. ఆమెకు సొంత ఫ్లాట్ ఉంది. సోదరుడితో కలిసి ఉంటుంది.గీత ప్రతిరోజూ రూ. 15 వందలు సంపాదిస్తుంది.

ఇలా భారత్ లో చాలామంది భిక్షాటన చేసినవారిలో చాలామంది లక్షాధికారులే నని తెలుస్తోంది. భిక్షాగాళ్ల ఇంటిలో లక్షలు లభ్యమయ్యాయని పలు వార్తల్లో వింటుంటాం.చూస్తుంటాం. ఇలా పలువురు భిక్షగాళ్లు తిండిలేక ఉండటానికి ఇల్లు లేక అడుక్కోవట్లేదని నమ్మాల్సిన నిజం.వారికి అదొక ఆదాయవనరుగా మారిపోయింది భిక్షాటన అనేది.రూపాయి పెట్టుబడి ఉండది. కష్టపడక్కర్లేదు.విసుగు విరామం లేకుండా చక్కగా ఓ బొచ్చె పట్టుకుని కూర్చుంటే చాలు సాయంత్రానికి ఎంతో కొంత వచ్చి పడుతుంది.అనేలా ఉంది భిక్షగాళ్ల తీరు చూస్తే.

10TV Telugu News