NIA Raids in Telugu States : మావోయిస్టు సానుభూతిపరులే టార్గెట్ గా తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు

మావోయిస్టు సానుభూతిపరులే టార్గెట్ గా తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

NIA Raids in Telugu States : మావోయిస్టు సానుభూతిపరులే టార్గెట్ గా తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు

Nia Raids In Telugu States

NIA raids in telugu states : మావోయిస్టు సానుభూతిపరులే టార్గెట్ గా తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ఎంతోమంది మావోయిస్టులను పోలీసులు మట్టుపెట్టారు. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు కూడా ఉన్నారు. ముఖ్యంగా మావోయిస్ట్‌ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ (ఆర్కే) మృతి మావోలకు పెద్ద దెబ్బే తగిలింది. ఆర్కే మృతి,గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో మావోయిస్టులతో లింకులపై NIA ఆరా తీస్తున్నారు. వారి సానుభూతిపరులపై కన్నేశారు. వారి కదలికలపై డేగకన్నుతో కనిపెడుతున్నారు.మావోల సానుభూతిపరుల ఇళ్లను తనిఖీలు చేస్తున్నారు.

దీంట్లో భాగంగా..ఏపీలోని ప్రకాశం జిల్లాలో NIA తనిఖీలు చేపట్టారు. జిల్లాలోని అలకూరపాడులో విరసం నేత..ఆర్కేకు సమీప బంధువు అయిన కల్యాణ్‌రావు ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులతో సంబంధాలు..లావాదేవీలు వంటి పలు కీలక అంశాలపై కల్యాణ్‌రావును ప్రశ్నిస్తున్నారు.2004లో మావోయిస్టు ఆర్కే ప్రభుత్వంతో చర్చలకు వచ్చినప్పుడు మీడియాలో వచ్చిన కథనాలు, ఫొటోలు, అరెస్టులు వంటి పలు కీలక అంశాలను కథనంగా రూపొందించి ఆర్కే భార్య శిరీష కథనాలను పుస్తకంగా తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ దాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో ఆర్కే జీవిత చరిత్ర పుస్తకం ప్రచురణపై కూడా ఆరా తీస్తున్నట్టుగా సమాచారం.

Read more : Maoist Leader RK : నా భర్త జ్ఞాపకాలతో పుస్తకాన్ని తేవాలనుకున్నా.. పోలీసులు అడ్డుకున్నారు : మావోయిస్టు నేత ఆర్కే సతీమణి

ఎన్‌ఐఏ పేరుతో ఉన్న జాకెట్లను ధరించి వచ్చారు అధికారులు. కల్యాణ్‌రావు ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఇంటిలో అనుమానాస్పదంగా ఉన్న ప్రతి అంగుళాన్ని కూడా వదలకుండా తనిఖీలు చేశారు.అలాగే డాబా పైభాగాన్ని కూడా పరిశీలించారు ఎన్‌ఐఏ ప్రత్యేక అధికారి. ఇక అటు విశాఖలోని అన్నపూర్ణ నివాసంలోనూ తనిఖీలు చేపట్టారు ఎన్‌ఐఏ అధికారులు. మావోయిస్టులతో సంబంధాలపై ప్రశ్నిస్తున్నారు.అలాగే తెలంగాణలోనూ NIA అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. నాగోల్‌లోని మాజీ మావోయిస్టుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. హైదరాబాద్‌ మాజీ మావోయిస్ట్‌ రవితో పాటు అనురాధ ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసి లొంగిపోయాడు రవిశర్మ. ఇక అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సుభాష్‌ నగర్‌లో అమరవీరుల బంధుమిత్రుల సంఘం నాయకురాలు భవానీ ఇంట్లోనూ తనిఖీలు చేస్తున్నారు ఎన్‌ఐఏ అధికారులు.

Read more : Heart Touching video : కల్మషం లేని ఈ పసిప్రేమకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే

ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లతో పాటు పుస్తకాలను కూడా ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా విరసం నేతల కల్యాణ్‌రావు ఇంట్లో సోదాలు చేయడం చాలా కీలకంగా మారింది. కల్యాణ్ రావును ప్రశ్నించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మరి ఆయన నుంచి అధికారులు ఎటువంటిసమాచారాన్ని రాబట్టారు అనే విషయం తెలియాల్సి ఉంది. కాగా… ఆర్కే జ్ఞాపకాలను పుస్తక రూపంలో ప్రింట్ చేయిస్తుంటే పోలీసులు అడ్డుకున్నారన్నారని..పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారని వాటిని తిరిగి ఇచ్చేయాలని ఆర్కే భార్య శిరీష డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.  ప్రింటింగ్ ప్రెస్‌పై పోలీసులు దాడి చేసి పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారని ఆమె ఆవేదన చెందారు. ప్రింటింగ్ చేస్తున్న దశలోనే పుస్తకాలను తీసుకెళ్లిపోయారనీ..పోలీసులు ఆ పుస్తకాలను తిరిగివ్వాలని..పుస్తకావిష్కరణకు కూడా అవకాశం కల్పించాలని కోరారు.