Maoist Leader RK : నా భర్త జ్ఞాపకాలతో పుస్తకాన్ని తేవాలనుకున్నా.. పోలీసులు అడ్డుకున్నారు : మావోయిస్టు నేత ఆర్కే సతీమణి

మావోయిస్టు పార్టీలో 40 ఏళ్ళు పోరాటం చేసిన తన భర్త జ్ఞాపకాలతో పుస్తకాన్ని తెద్దాము అనుకున్నా..కానీ పోలీసులు అడ్డుకున్నారని మావోయిస్టు నేత ఆర్కే సతీమణి శిరీష తెలిపారు.

Maoist Leader RK : నా భర్త జ్ఞాపకాలతో పుస్తకాన్ని తేవాలనుకున్నా.. పోలీసులు అడ్డుకున్నారు : మావోయిస్టు నేత ఆర్కే సతీమణి

Shireesha

Book with memoirs of Maoist leader RK : మావోయిస్టు పార్టీలో 40 ఏళ్ళు పోరాటం చేసిన తన భర్త జ్ఞాపకాలతో పుస్తకాన్ని తెద్దాము అనుకున్నా..కానీ పోలీసులు అడ్డుకున్నారని మావోయిస్టు నేత ఆర్కే సతీమణి శిరీష తెలిపారు. ఈ మేరకు ఆమె 10టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. సాయుధ శాంతి స్వప్నం పేరుతో పుస్తకాన్ని ఈ నెల 14 న రీలీజ్ చేద్దామనుకున్నానని చెప్పారు. కానీ ఈ పుస్తకాన్ని పోలీసులు అడ్డుకున్నారని ఆమె వాపోయారు.

ఆర్కే చనిపోయినా అతని జ్ఞాపకాలను పుస్తక రూపంలో చూద్దామనుకున్నా…కానీ ఈ ప్రభుత్వానికి మింగుడు పడడం లేదని మండిపడ్డారు. ఆర్కే మావోయిస్టు పార్టీలో ఎంత నిస్వార్థంగా పని చేశారో ప్రపంచ అంత చూసిందన్నారు. పుస్తకాన్ని తీసుకొస్తున్నామని డీజీపీకి ముందే సమాచారం ఇచ్చామని తెలిపారు. ఈ పుస్తకంలో ఎలాంటి మావోయిస్టు భావజాలం లేదని స్పష్టం చేశారు.

Amit Shah : అమిత్‌షా తిరుపతి పర్యటనలో మార్పులు

కేవలం ఆర్కే జీవితం, తన కొడుకు బలిదానంపైన ఈ పుస్తకం తెస్తున్నామని వెల్లడించారు. మావోయిస్టు పార్టీ భావజాలం ఉందని రాత్రి పోలీసులు నానా హంగామా చేశారని వాపోయారు. సీజ్ చేసిన పుస్తకాలను వెంటనే తిరిగి ఇవ్వాలని..లేకపోతే న్యాయపరంగా పోరాటం చేస్తానని పేర్కొన్నారు.