Amit Shah : అమిత్‌షా తిరుపతి పర్యటనలో మార్పులు

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తిరుపతి పర్యటనలో మార్పులు జరిగాయి. ఈ సాయంత్రం రేణిగుంట చేరుకోనున్న ఆయన రాత్రి 8.30గంటలకు తిరుమల వెళ్లనున్నారు.

Amit Shah : అమిత్‌షా తిరుపతి పర్యటనలో మార్పులు

Amit Shah

Updated On : November 13, 2021 / 4:08 PM IST

Amit Shah’s visit to Tirupati : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తిరుపతి పర్యటనలో మార్పులు జరిగాయి. ఈ సాయంత్రం రేణిగుంట చేరుకోనున్న ఆయన రాత్రి 8.30గంటలకు తిరుమల వెళ్లనున్నారు. రాత్రి 8.45 గంటలకు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొననున్నారు. అమిత్‌షాతో పాటు సీఎం జగన్‌ కూడా శ్రీవారిని దర్శించుకోనున్నారు.

శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతి తాజ్‌ హోటల్‌లో అమిత్‌షా బస చేయనున్నారు. రేపు ఉదయం నెల్లూరులోని స్వర్ణభారత్‌ ట్రస్టుకు ఆయన వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం దక్షిణాది జోనల్‌ కౌన్సిల్‌ భేటీలో అమిత్‌షా పాల్గొననున్నారు.

Solar Power : సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి సౌర విద్యుత్‌ కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్

తొలుత పర్యటనలో సాయంత్రం 7.40 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకొని పలు కార్యక్రమాల్లో పాల్గొని సోమవారం శ్రీవారిని దర్శించుకుంటారని సంబంధింత వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే.