Today HeadLines : ఏపీలో 21 మంది ఐఏఎస్‌ల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో 21 మంది ఐఏఎస్లను బదిలీ చేశారు. అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల జాయింట్ కలెక్టర్లు బదిలీ అయ్యారు.

Today HeadLines : ఏపీలో 21 మంది ఐఏఎస్‌ల బదిలీ

ఏపీలో 21 మంది ఐఏఎస్‌ల బదిలీ
ఆంధ్రప్రదేశ్‌లో 21 మంది ఐఏఎస్లను బదిలీ చేశారు. అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల జాయింట్ కలెక్టర్లు బదిలీ అయ్యారు. జీవీఎంసీ అడిషనల్ కమిషనర్‌గా వైజాగ్ జేసీ విశ్వనాథ్ నియామితుడయ్యారు. కాకినాడ జాయింట్ కలెక్టర్ ఇలక్కియ పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్‌గా బదిలీ అయ్యారు. అలాగే, కాకినాడ జాయింట్ కలెక్టర్‌గా ప్రవీణ్ ఆదిత్ నియామితుడయ్యారు.

గుడ్‌న్యూస్.. 2,375 కొత్త బస్సులు వచ్చేస్తున్నాయ్..
తెలంగాణలో ఫ్రీ బస్సు సౌకర్యం ద్వారా మహిళలు 45 రోజుల్లో 12 కోట్ల ట్రిప్‌లకు పైగా ఉచితంగా ప్రయాణం చేశారని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. హైదరాబాద్‌ నాంపల్లిలో ఓ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ విషయాన్ని తెలిపారు. త్వరలోనే 2,375 కొత్త బస్సులు తీసుకుంటున్నామన్నారు.

బీహార్‌‌లో కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వం : 9వసారి సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం
బీహార్‌లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. 9వసారి సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం చేశారు. గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ నితీశ్‌తో ప్రమాణం చేయించారు. నితీశ్ తో పాటు 8 మంది మంత్రులు ప్రమాణం చేశారు. బీజేపీ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలు, ఒక మంత్రి ఉండగా.. జేడీయూ నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. హెచ్ఏఎం నుంచి ఒకరు, స్వతంత్ర ఎమ్మెల్యే ఒకరు మంత్రిగా ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ప్రమాణం చేయగా.. మంత్రులుగా ప్రేమ్ కుమార్, విజయ్ కుమార్ చౌదరి, శ్రవణ్ కుమార్, విజయేంద్ర ప్రసాద్ యాదవ్, సంతోష్ కుమార్ సుమన్, సుమిత్ కుమార్ ప్రమాణం చేశారు. నితీష్ ప్రమాణ స్వీకారానికి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సహా కేంద్ర మంత్రులు హాజరయ్యారు.

మహిళలకు ఉచిత ప్రయాణ పథకంపై కేటీఆర్ కామెంట్స్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందిస్తుండడంతో ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆటో సోదరులను ఆదుకోవాలన్నారు. మహిళలకు ఇబ్బందులు ఎదురుకాకుండా బస్సుల సంఖ్య పెంచాలని చెప్పారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రామ మందిర ప్రస్తావన ..
అయోధ్య‌లో అత్యంత వైభ‌వంగా ప్రారంభ‌మైన రామ మందిర అంశాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆదివారం మ‌న్ కీ బాత్‌లో ప్ర‌స్తావించారు. మందిరం దేశ ప్ర‌జ‌ల‌ను ఎలా ఐక్యం చేసింద‌నే విష‌యాన్ని ఆయ‌న హైలైట్ చేశారు. శ్రీరాముడి పాల‌న మ‌న రాజ్యాంగ నిర్మాత‌ల‌కు స్ఫూర్తిగా నిలిచింద‌ని గుర్తుచేశారు. లోతైన చర్చలతో రూపొందించబడిన భారత రాజ్యాంగంలోని మూడవ అధ్యాయంలో, భారత పౌరుల ప్రాథమిక హక్కులను వివరించడం జరిగిందని ప్ర‌ధాని చెప్పారు.

కేసీఆర్ ప్రమాణ స్వీకారం..
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ఫిబ్రవరి 1న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కు శనివారం ఆయన లేఖ రాశారు. డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా.. అదేనెల 9న కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, కేసీఆర్ కు శస్త్ర చికిత్స కారణంగా ఆయన ప్రమాణ స్వీకారంకు హాజరుకాలేదు. తాజాగా ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

రోడ్డు ప్రమాదం..
హైదరాబాద్ పరిధిలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరమ్ పేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి కరెంట్ పోల్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఒకరు మరణించగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి.

తొలి ప్రయాణం..
అమెరికాలోని ప్లోరిడా రాష్ట్రం మాయామీ పోర్టు నుంచి ప్రపంచంలోని అతిపెద్ద క్రూజ్ నౌక తొలి ప్రయాణంకు సిద్ధమైంది. వారం రోజులపాటు సముద్ర జలాలపై విహరిస్తూ వివిధ దీవులను ఈ క్రూజ్ నౌక చుట్టేయనుంది. ఈ నౌకలో 2,350 మంది సిబ్బంది, 7,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది.

తిరుమల సమాచారం..
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 24గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 76,104 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 2.92 కోట్లు సమకూరింది.

బీహార్ రాజకీయాలు ..
బీహార్ రాజకియాలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. ఇవాళ ఉదయం 10గంటలకు జేడీయూ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేయనున్నారు. నితీశ్ కుమార్ నివాసానికి బీజేపీ నేతలు వెళ్లనున్నారు. సాయంత్రం 4గంటలకు బీజేపీ మద్దతుతో సీఎంగా నితీశ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

షర్మిల పర్యటన..
ఇవాళ తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. ఆయా జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలతో షర్మిల సమావేశం అవుతారు.

తెలంగాణ యువతి ఎంపిక..
ఏపీ హైకోర్టు నిర్వహించిన జూనియర్ సివిల్ జడ్జి నియామక పరీక్ష ఫలితాల్లో తెలంగాణ యువతి అలైఖ్య ప్రథమ స్థానం సాధించింది. అలేఖ్య హైదరాబాద్ పెండేకంటి కళాశాలలో 2022లో న్యాయశాస్త్ర విభాగంలో ఉత్తీర్ణులయ్యారు. హనుమకొండకు చెందిన మాధవీలత, పరిమి మనోజ్ కుమార్ దంపతుల కుమార్తె.

పురందేశ్వరి పర్యటన..
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఇవాళ విజయవాడలో పర్యటించనున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

నేడు ఆలస్యంగా తెలంగాణ ఎక్స్ ప్రెస్ ..
నేడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఆలస్యంగా బయల్దేనుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. నాంపల్లి నుంచి ఉదయం 6గంటలకు బదులుగా మధ్యాహ్నం 2గంటలకు బయల్దేరుతుంది. ఢిల్లీ నుంచి 26న సాయంత్రం 4గంటలకు బదులుగా రాత్రి 7.05గంటలకు బయల్దేరింది. 27న కూడా రైలు బయల్దేరే సమయాన్ని దక్షిణ మధ్య రైల్వే 8గంటలు వాయిదా వేసింది.