Today Headlines : ఇందిరమ్మ రాజ్యంలో అన్నీ కష్టాలే ఉంటాయన్న కేసీఆర్.. వారికి ఓటేస్తే మూసీలో వేసినట్లేనన్న రేవంత్

గజ్వేల్‌ నియోజకవర్గంలో బీజేపీకి ఓట్లు అడిగే అర్హత లేదని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో హరీశ్ రావు రోడ్డు షో నిర్వహించారు

ఇందిరమ్మ రాజ్యంలోనే న్యాయం .. 

నాంపల్లి గుడిమల్కాపూర్ ప్రాంతాల్లో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. బీజేపీకి ఓటు వేస్తే మూసీలో వేసినట్లేనని, నాంపల్లిలో ఎంఐఎంను ఓడించి కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు.

కష్టాల రాజ్యం..
ఇందిరమ్మ రాజ్యంలో అన్నీ కష్టాలే ఉంటాయని, బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. నకిరేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు చేశారు.

ప్రక్షాళన చేస్తాం.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి హైదరాబాద్ లోని ఎల్బీనగర్, పలు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. టీఎస్‌పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ప్రతీయేటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అన్నారు.

భారీగా సీజ్.. 

ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి నేటి వరకు ఈ ఐదు రాష్ట్రాల్లో మొత్తం రూ. 1,760 కోట్లు (నగదు, మద్యం, డ్రగ్స్, ఉచిత బహుమతులు, విలువైన వస్తువులు) సీజ్ చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. పూర్తి కథనం ..

వైసీపీపై నాదెండ్ల ఫైర్ ..
జనసేన నేత నాదెండ్ల మనోహర్ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. సీఎం జగన్ నివాసంలో పచ్చదనానికి రూ. 21కోట్లు.. జగనన్న కాలనీల్లో కనీస వసతులు కల్పించలేదని విమర్శించారు.

ఢిల్లీకి టీడీపీ నేతల బృందం ..
టీడీపీ నేతల బృందం రేపు ఢిల్లీ వెళ్లనుంది. కేంద్ర ఎన్నికల సంఘాన్ని బృందం కలవనుంది. ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఫిర్యాదు చేయనున్నారు.

తెలంగాణకు ప్రియాంక..
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు. ఈనెల 24న ప్రియాంక గాంధీ రాష్ట్రానికి వస్తారు.. మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

ప్రభుత్వ సాయం..
బోట్లు కోల్పోయిన విశాఖ మత్స్యకారులకు ప్రభుత్వం సాయం అందించనుంది. 80శాతం పరిహారం ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఇదిగో సాక్ష్యం ..
అల్‌ షిఫా ఆసుపత్రిలో బందీలను హమాస్ దాచినట్లు వీడియోను ఇజ్రాయెల్‌ సైన్యం విడుదల చేసింది.

కాంగ్రెస్‌ హామీలపై కేటీఆర్‌ ఫైర్‌ ..
యాదాద్రి భువనగిరి జిల్లాలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యాదగిరిగుట్ట, వలిగొండ రోడ్ షోలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రెండు వందల పెన్షన్‌ ఇవ్వని వారు 4వేలు ఇస్తారా? అంటూ కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. ఒక్క చాన్స్ కాంగ్రెస్ కు ఇస్తే ఆగం అవుతామని కేటీఆర్ అన్నారు. పూర్తి కథనం..

జైలుకు పంపిస్తాం..

బీజేపీతోనే తెలంగాణలో కుటుంబ పాలనకు విముక్తి అని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. జగిత్యాల జిల్లాలో జరిగిన సభలో అమిత్ షా మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. అవినీతిపరులను జైలుకు పంపిస్తామని చెప్పారు.

బాబు డైరెక్షన్..
చంద్రబాబు డైరెక్షన్‌లోనే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ జరిగిందని వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల అన్నారు. ఆధారాన్నీ కోర్టుకు సమర్పించామని తెలిపారు. పూర్తి కథనం .. 

ఎవరినీ వదలం..
ఎన్నికల వేళ అధికారులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. కేసీఆర్‌ కాన్వాయ్‌ బస్సును తనిఖీ చేశారు. పూర్తి కథనం ..

బీజేపీకి అర్హత లేదు..
గజ్వేల్‌ నియోజకవర్గంలో బీజేపీకి ఓట్లు అడిగే అర్హత లేదని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో హరీశ్ రావు రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పూర్తి కథనం ..

ఇదేమి రాజ్యం?
రైతుల బలవన్మరణాల్లో తెలంగాణ నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. రాష్ట్రాన్ని కేసీఆర్ తాగుబోతుల అడ్డాగా మార్చారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

సంక్షేమమే ధ్యేయం ..
రైతు బందును 16 వేలకు పెంచుతున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నకిరేకల్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. మూడు గంటలు కరెంట్ చాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్‌ వస్తే 3 గంటలే కరెంట్‌ ఇస్తారు. కరెంట్ 24గంటలు కావాలా? 3 గంటలు కావాలా? అంటూ కేసీఆర్ ప్రశ్నించారు.

జాప్యానికి కారణమేంటి?
తమిళనాడు గవర్నర్‌పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. మూడేళ్లుగా బిల్లులను ఎందుకు ఆమోదించలేదని న్యాయస్థానం ప్రశ్నించింది.

టార్గెట్ కాంగ్రెస్ ..
సనాతన ధర్మాన్ని కాంగ్రెస్‌ నాశనం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. నేరాలకు రాజస్థాన్‌ నెంబర్‌ వన్‌గా మారిందన్నారు.

గెలుపు ధీమా ..
ప్రత్యేక రాష్ట్రంతో కేసీఆర్‌ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని, తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాబోతోందని రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

సహించేది లేదు..
అవినీతిలో కేసీఆర్‌ దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నారు. అవినీతిపరులను జైలుకు పంపిస్తామని ఎన్నికల ప్రచార సభలో కేంద్ర మంత్రి అమిత్‌ షా అన్నారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. ఈ విషయమై సోమవారం విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన బెయిల్ ఈ నెల 28 వరకు ఉంది. అయితే అది ఇంకా ముగియక ముందే మళ్లీ బెయిల్ రావడం గమనార్హం. పూర్తి కథనం ఇక్కడ చూడండి

యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అరెస్టు
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాద ఘటనలో యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిన్న సాయంత్రం లోకల్ బాయ్ నాని తన భార్య శ్రీమంతం వేడుకలు నిర్వహించారు. తన భార్య శ్రీమంతం సందర్భంగా లోకల్ బాయ్ నాని స్నేహితులకు బోటులో పార్టీ ఇచ్చారు. పార్టీ అనంతరం బోటుకు నిప్పు అంటుకుంది. లోకల్ బాయ్ నాని అగ్ని ప్రమాదాన్ని వీడియో తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు.

ఆటోడ్రైవర్లకు సీఎం కేసీఆర్‌ శుభవార్త
ఆటోడ్రైవర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. ఫిట్‌నెస్‌ చార్జీలు, సర్టిఫికెట్ల పర్మిట్‌ ఫీజు మాఫీ చేస్తున్నట్లు ఆయన సోమవారం ప్రకటించారు.

24 నుంచి యువగళం, ఈసారితో జనసేతో కలిసి
తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర పున:ప్రారంభం కాబోతోంది. ఈనెల 24 నుంచి మలివిడత పాదయాత్ర ప్రారంభించనున్నట్లు టీడీపీ సోమవారం తెలిపింది. అయితే ఈసారి జనసేనతో కలిసి ఈ యాత్ర చేయనున్నట్లు తెలిపారు.

ఆచరణ సాధ్యం కాని హామీలే
కాంగ్రెస్‌ పార్టీవి ఆచరణలో సాధ్యం కాని హామీలేనని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీలను ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు.

విశాఖ బోట్ల దగ్ధంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
విశాఖ బోట్ల దగ్ధంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవాలని మంత్రి సీదిరికి ఆదేశాలు జారీ చేశారు.

మాస్టర్ ప్లాన్
ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించే ఆపరేషన్ ఎనిమిదో రోజు కొనసాగుతోంది. సిల్క్యారా టన్నెల్ నుంచి కార్మికులను ఖాళీ చేయడానికి ఐదు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు రోడ్డు రవాణా శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ ప్రభుత్వ నిర్ణయంపై సమాచారం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం శనివారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలోనే కార్మికులను రక్షించడానికి ఈ ఐదు ప్రణాళికలను సిద్ధం చేశారు.

అల్‌ షిఫా డెత్‌ జోన్‌
గాజాలోని అల్‌ షిఫా ఆస్పత్రిని ప్రపంచ ఆరోగ్య సంస్థ డెత్‌జోన్‌గా ప్రకటించింది. ఆసుపత్రిలో 80 మంది వ్యక్తుల అవశేషాలు గుర్తించామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. యుద్ధంలో భాగంగా అల్ షిఫా ఆసుపత్రి మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.

విశాఖ ఫిషింగ్ హర్బర్ లో భారీ అగ్నిప్రమాదం 

విశాఖ ఫిషింగ్ హర్బర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హర్బర్ లో బోట్లుకు నిప్పు అంటుకోని బోట్లు తగలబడుతున్నాయి. 40 బోట్లు వరకు అగ్నికి ఆహుతి అయ్యాయి. భారీ మంటలు ఎగసిపడుతున్నాయి. ఒకబోటు తరువాత మరో బోటుకు మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది.

అభివృద్ధి కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి: నడ్డా
తెలంగాణలో అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. తాము అధికారంలోకి రాగానే అవినీతిని కూకటివేళ్లతో పెకిలిస్తామని ఆయన అన్నారు.

డబ్బులు ఎక్కడివి?
అజీజ్‌నగర్ నగదు కేసులో 10మందికి నోటీసులు పంపారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో ఏడున్నర కోట్ల రూపాయలు పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే అవి ఎవరివో తేల్చే పనిలో ఖాకీలు బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే 10 మందికి నోటీసులు పంపారు.

కాంగ్రెస్‌ అంటే అవినీతి, బంధుప్రీతి: మోదీ
కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి, బంధుప్రీతి అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శలు గుప్పించారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ రాజస్థాన్‌లో బీజేపీ సర్కార్‌ వస్తుందని.. అవినీతికి బంధుప్రీతికి చరమగీతం పాడుతుందని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు