KTR : పెన్షన్ రూ.5వేలకు పెంపు, కొత్త రేషన్ కార్డులు- మంత్రి కేటీఆర్ వరాలు

KTR On Pension Hike : ఆలేరులో ఏ గ్రామానికి పోతావో పో కరెంట్ వైర్లు పట్టుకో. రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుంది.

KTR : పెన్షన్ రూ.5వేలకు పెంపు, కొత్త రేషన్ కార్డులు- మంత్రి కేటీఆర్ వరాలు

KTR On Pension Hike (Photo : Facebook)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని అధికార బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. ఓటర్లను ఆకర్షించేందుకు వరాల వర్షం కురిపిస్తోంది. అధికారంలోకి వస్తే పెన్షన్ పెంచుతామని, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

ఆ ఇద్దరు గెలుసుడు పక్కా?
యాదాద్రి భువనగిరి జిల్లాలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యాదగిరిగుట్ట, వలిగొండ రోడ్ షో లో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఇది విజయోత్సవ సభలా ఉందని ఆయన అన్నారు. సునీత అక్క, ఫైళ్ల శేఖర్ రెడ్డి గెలుసుడు పక్కా అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 30వ తేదీన ఎన్నికలు ఉన్నాయన్న కేటీఆర్ గతంలో అవకాశం ఇస్తే ఏం చేశామో తెలుసన్నారు. 2014లో యాదగిరిగుట్ట ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉందో అందరికి తెలుసు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Also Read : మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయం.. హోరాహోరీ ప్రచారం

కొండపైకి ఆటోలు నడిపిస్తాం..
”యాదాద్రి ఆలయం అద్భుతంగా పునర్నిర్మాణం జరిగింది. దేశమంతా యాదాద్రి ఆలయం గురించి మాట్లాడుతున్నారు. తాత్కాలికంగా నష్టపోయినప్పటికీ ఆటో కార్మికులకు న్యాయం చేస్తాం. ఆటో కార్మికులకు మాట ఇస్తున్నా. డిసెంబర్ 3వ తేదీన కొండపైకి ఆటోలు నడిపిస్తాం. ఆటో కార్మికులు ఎవరూ భయపడొద్దు.

కాంగ్రెస్ పాలనలో కాలిపోయిన మోటర్లు, ఎండిన చెరువులు..
కాంగ్రెస్ పార్టీకి సిగ్గు రావాలి. కాంగ్రెస్ పాలనలో కాలిపోయిన మోటర్లు, ఎండిపోయిన చెరువులు ఉండే. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు.. కరెంట్ ఏడుంది అని అడుగుతున్నారు. ఆలేరులో ఏ గ్రామానికి పోతావో పో కరెంట్ వైర్లు పట్టుకో. రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుంది. వాళ్ళ దిమాక్ మోకాళ్ళలో ఉంది. రేవంత్ కు వ్యవసాయం తెలియదు. పబ్బులు, క్లబ్ లు కావాలి.

Also Read : చుక్క మీ ఇంట్లో.. ముక్క మా ఇంట్లో- ఎన్నికల సిత్రాలు

పెన్షన్ 5వేలకు పెంపు..
కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉత్త కరెంట్ ఇచ్చారు. భూమికి రెండు ఫీట్లు లేనోడు అన్ని మాట్లాడుతున్నాడు. ఉమ్మడి జిల్లాలో అధికంగా పంట సాగు అవుతుంది. 11 సార్లు గెలిచి కాంగ్రెస్ ఏం చేసింది? ఒక్క చాన్స్ కాంగ్రెస్ కు ఇస్తే ఆగం అవుతాం. దరిద్రానికి నేస్తం.. హస్తం.. సాగు, తాగు నీరు కష్టాలు పోయినాయి. కరోనాతో లక్ష కోట్ల నష్టం వచ్చింది. డిసెంబర్ 3 తర్వాత రేషన్ కార్డులు వస్తాయి. ఆడ బిడ్డలకు డిసెంబర్ 3 తర్వాత (18 ఏళ్ళు నిండిన) నెలకు రూ. 3వేలు కేసీఆర్ ఇస్తున్నారు. ఆసరా పెన్షన్ రూ.5వేలు చేయబోతున్నాం. గ్యాస్ సిలిండర్ రూ.400లకే ఇస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం ఇస్తున్నాం. పొలం ఉన్నా లేకున్నా రూ.5లక్షల కేసీఆర్ భీమా ఇస్తున్నాం.

రైతుబంధు 15వేలు ఇస్తాం..
ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు వద్దు అంటున్నారు. సునితక్కను, శేఖర్ రెడ్డి లను గెలిపించండి. రైతు బంధు 15వేలు ఇస్తాం. ప్రతి ఊరిలో మహిళా సమాఖ్య భవనం. సమ్మక్క, సారక్క పేరుతో భవనాలు. ఆలేరు రెవెన్యూ డివిజన్, మాదాపూర్, రఘునాథపురం గ్రామాలను మండలాలు చేస్తాం. బీఆర్ ఎస్ అభ్యర్థులకు మంచి మెజార్జీ ఇవ్వండి. పనులన్ని చేస్తా. తుర్కపల్లి ఐటీ, దాతారుపల్లిలో పార్క్ ఏర్పాటు చేస్తున్నాం. తొమ్మిదిన్నర ఏళ్ళలో అభివృద్ధి చేశాం. ఢిల్లీ చేతిలోకి వెళ్తే ఇబ్బందే. ఆలేరు, భువనగిరిలో గులాబీ జెండా ఎగరాలి” అని మంత్రి కేటీఆర్ అన్నారు.