Today Headlines : రైతులను విలన్లుగా చూపొద్దన్న సుప్రీంకోర్టు.. నేషనల్ హెరాల్డ్ కేసులో 751 కోట్ల ఆస్తులు అటాచ్

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితి ఊహించలేము అన్నారాయన. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్క చాన్స్‌ ఇవ్వాలని ఓటర్లను వేడుకున్నారు.

11PM Head Lines

తెలంగాణలో పవన్ ఎన్నికల ప్రచారం, వరంగల్ నుంచి శ్రీకారం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. బుధవారం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల తరపున జనసేనాని ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా పవన్ ప్రచారం చేయనున్నారు. వరంగల్, కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాకలో పవన్ ప్రచారం చేయనున్నారు. (పూర్తి కథనం)


రూ.751 కోట్ల ఆస్తులు అటాచ్‌

నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఈడీ దూకుడు పెంచింది. రూ.751.90కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) వెల్లడించింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌తోపాటు దాన్ని నిర్వహిస్తోన్న యంగ్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు తాత్కాలిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపింది.

కాంగ్రెస్‌కు 20 సీట్లే- సీఎం కేసీఆర్ జోస్యం
కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చేది 20 సీట్లే అని జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు స‌చ్చేది లేదు.. ఆ పార్టీకి 20 సీట్లే వ‌స్తాయి అని మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెసోళ్లు కొత్త డ్రామా మొద‌లు పెట్టారు. కాంగ్రెస్‌లో ఇవాళ డ‌జ‌న్ మంది ముఖ్య‌మంత్రులు ఉన్నారు. గెలిచేది లేదు స‌చ్చేది లేదు. గ్యారెంటీగా చెబుతున్నా.. మ‌ళ్ల గ‌దే 20 సీట్లు వస్తాయి అని కేసీఆర్ అన్నారు.

BRS మ్యానిఫెస్టోను కాంగ్రెస్‌ కాపీ కొట్టింది
BRS మ్యానిఫెస్టోను కాంగ్రెస్‌ కాపీ కొట్టిందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. హస్తం నేతలను నమ్మితే ఆగం కావల్సిందేనని ఓటర్లను హెచ్చరించారు.

పంజాబ్‌ సర్కార్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఢిల్లీలో తీవ్ర స్థాయికి పెరిగిపోయిన వాయు కాలుష్యం అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేసింది. విచారణ అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాల తీరుపై ఆసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాలుష్యం విషయంలో రైతులను విలన్లుగా చూపొద్దని హర్యానా ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది దేశ అత్యున్నత న్యాయస్థానం.

పరువు నష్టం దావా వేసిన మంత్రి రోజా
టీడీపీకి చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, నగరి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గాలి భాను ప్రకాష్, ఓ న్యూస్ ఛానల్ ప్రతినిధి రాజేంద్రప్రసాద్‭ల మీద మంత్రి రోజా కేసు దాఖలు చేశారు. తన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని, తన గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడారని పేర్కొంటూ ముగ్గురిపై పరువు నష్టం కేసు వేశారు. (పూర్తి కథనం)

టీడీపీ ఫిర్యాదు
ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం పార్టీ బృందం కలిసింది. ఓటరు జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేసింది.(పూర్తి కథనం)

స్కూల్లో కాల్పులు
కేరళ త్రిసూల్‌లో కాల్పుల కలకలం రేగింది. టీచర్లను చంపేందుకు పూర్వ విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

ఏపీ ఫైబర్‭నెట్ కేసులో ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీ కోర్టు అనుమతి
ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో అక్రమాలకు పాల్పడిన టేరాసాఫ్ట్ ఎండీ వేమూరి హరిప్రసాద్ ఆస్తులు అటాచ్‌మెంట్ చేయాలని సీఐడి దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన ఏసీబీ కోర్టు.. ఈ కేసులో ఆస్తుల అటాచ్ మెంట్ కు అనుమతి ఇచ్చింది. (పూర్తి కథనం)

సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సీఐడీ
చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ సీఐడీ. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడంపై సీఐడీ అభ్యంతరం తెలిపింది. (పూర్తి కథనం)

టీడీపీ టెక్‌ మోసం
భవిష్యత్‌ గ్యారెంటీ పేరుతో ప్రజలకు మెసేజ్‌లు పంపి మోసం చేస్తున్నారని మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ మోసాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు.

మెగా సపోర్ట్‌ ..
నటి త్రిషపై మన్సూర్‌ అలీ వ్యాఖ్యలను చిరంజీవి ఖండించారు. మహిళలపై తీవ్రమైన పదజాలం సరికాదని మెగాస్టార్‌ అన్నారు.

సవాళ్ల పర్వం ..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. కరీంనగర్ నియోజకవర్గంలో మంత్రి గంగుల, బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అవినీతిపరులెవరో తేల్చుకుందాం.. ఆస్తులన్నీ పంచేందుకు సిద్ధమా..? అంటూ మంత్రి గంగులకు బండి సంజయ్‌ సవాల్‌ చేశారు.

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ ప్రమాదంపై FIR
విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరమైంది. ఈ ఘటనపై తాజాగా FIR నమోదు చేశారు. సీసీ ఫుటేజ్‌, నిందితుల కాల్‌ డేటా పరిశీలిస్తున్నారు. తొందరలోనే అన్ని వివరాలు కనుక్కుంటామని పోలీసులు తెలిపారు. (పూర్తి కథనం)

కరెంట్ చూడాలంటే తీగలు పట్టుకోండి: కేటీఆర్
కరెంట్‌ రావట్లేదంటూ విమర్శలు చేస్తున్న నేతలు విద్యుత్‌ తీగలు పట్టుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్‌ పార్టీ అని ఆయన విమర్శలు గుప్పించారు.

ఒక్క చాన్స్‌
పదేళ్ల భారత్ రాష్ట్ర సమితి పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్క చాన్స్‌ ఇవ్వాలని ఆయన ప్రజలను వేడుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు