Pawan Kalyan : తెలంగాణలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ ఖరారు, ఎక్కడెక్కడ అంటే..
Pawan Kalyan Election Campaign : అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభ్యర్థుల తరపున పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

Pawan Kalyan Election Campaign (Photo : Google)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నారు. తెలంగాణలో పవన్ ఎలక్షన్ క్యాంపెయిన్ కు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. బుధవారం నుంచి ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టనున్నారు.
Also Read : ఆదాయం సరే.. అప్పుల గురించి చెప్పండి.. కేటీఆర్కు నిర్మల స్ట్రాంగ్ కౌంటర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. ఈ క్రమంలో ఉమ్మడి అభ్యర్థుల తరపున పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో పవన్ కల్యాణ్ తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. వరంగల్, కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాకలో నిర్వహించే ప్రచార సభల్లో పవన్ కల్యాణ్ పాల్గొంటారు.
తెలంగాణలో శ్రీ @PawanKalyan గారు ఎన్నికల ప్రచారం pic.twitter.com/sRgkQRZnn2
— JanaSena Party (@JanaSenaParty) November 21, 2023
పొత్తులో భాగంగా బీజేపీ.. జనసేనకు 8 స్థానాలు కేటాయించిన సంగతి తెలిసిందే.
జనసేన పోటీ చేస్తున్న స్థానాలు, అభ్యర్థులు..
కూకట్ పల్లి – ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్
తాండూరు – నేమూరి శంకర్ గౌడ్
కోదాడ – మేకల సతీశ్ రెడ్డి
నాగర్ కర్నూల్ – వంగ లక్ష్మణ్ గౌడ్
ఖమ్మం – మిర్యాల రామకృష్ణ
కొత్తగూడెం – లక్కినేని సురేందర్ రావు
వైరా (ఎస్టీ) – డా.తేజావత్ సంపత్ నాయక్
అశ్వారావుపేట (ఎస్టీ) – ముయబోయిన ఉమాదేవి.