Arjun Rampal-Gabriell: ఆరేళ్లుగా డేటింగ్.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. పెళ్లి గురించి అడిగితే ఏమన్నారో తెలుసా..?
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్(Arjun Rampal-Gabriell) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. రీసెంట్ గా ఆయన తెలుగులో బాలకృష్ణ హీరోగా వచ్చిన భగవంత్ కేసరి సినిమాలో విలన్ గా నటించాడు.
Arjun Rampal and Gabriella got engaged after six years of dating.
Arjun Rampal-Gabriell; బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. రీసెంట్ గా ఆయన తెలుగులో బాలకృష్ణ హీరోగా వచ్చిన భగవంత్ కేసరి సినిమాలో విలన్ గా నటించాడు. తాజాగా, ఈ స్టార్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేశాడు. అర్జున్ రాంపాల్ గత ఆరేళ్లుగా గాబ్రియెల్లా డెమట్రాయిడ్స్ డేటింగ్ లో ఉంటున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. కానీ, పెళ్లి మాత్రం కాలేదు. అయితే, రీసెంట్ గా ఈ జంట ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. ఈ పాడ్ కాస్ట్ లో తమ పర్సనల్ లైఫ్ గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చారు.
Premante OTT: ఓటీటీలోకి ‘ప్రేమంటే’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
యాంకర్ అర్జున్ రాంపాల్-గాబ్రియెల్లా డెమట్రాయిడ్స్(Arjun Rampal-Gabriell) పెళ్లి గురించి అడిగింది. దానికి సమాధానంగా అర్జున్ రాంపాల్ మాట్లాడుతూ.. మాకు రీసెంట్ గా ఎంగేజ్మెంట్ అయ్యింది. కానీ, ఇంకా పెళ్లి కాలేదు. అని చెప్పాడు. దానికి, గాబ్రియెల్లా డెమట్రాయిడ్స్ “ఎప్పడు అవుతుందో కూడా తెలియదు” అంది. దానికి యాంకర్ షాక్ అయ్యింది. కానీ, ఆరేళ్లుగా సాగుతున్న వీరి డేటింగ్ ఎట్టకేలకు నెక్స్ట్ స్టెప్ కి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఎంగేజ్మెంట్ అయ్యింది కాబట్టి, త్వరలోనే పెళ్లి కూడా ఉండొచ్చు అనే టాక్ నడుస్తోంది. మరి ఆ పెళ్లి ఎప్పుడు ఉంటుందో అనేది చూడాలి.
ఇక అర్జున్ రాంపాల్ 1998లో ప్రొడ్యూసర్ మెహర్ జెసియాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. కానీ, వారి మధ్య వచ్చిన విభేదాల కారణంగా 2018లో ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత నటి గాబ్రియెల్లాతో ప్రేమలో పడ్డ అర్జున్ రాంపాల్ పెళ్లి చేసుకోకుండానే ఆమెతో పిల్లలను కన్నాడు.
