Head lines
బీజేపీ తెలంగాణ మ్యానిఫెస్టో విడుదల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదలైంది. శనివారం హైదరాబాద్ లోని హోటల్ కత్రియలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దశ దిశ పేరుతో మ్యానిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేశారు. సుపరిపాలన, అభివృద్ధి, పేదల సంక్షేమం సంకల్పంతో 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తమ మ్యానిఫెస్టోను విడుదల చేసినట్లు అమిత్ షా పేర్కొన్నారు.
కాంగ్రెస్ రూ.2వేల పింఛన్ ఇస్తే ముక్కునేలకు రాస్తా
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 2వేల పింఛన్ ఇస్తే ముక్కునేలకు రాస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 200, 500 రూపాయల పించన్ వచ్చేదని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దాన్ని 2000 రూపాయలకు తీసుకెళ్లినట్లు కేసీఆర్ చెప్పారు. తమ 10 ఏళ్ల పాలనను కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనతో పోల్చి చూడాలని, ఈ రెండింటిలో తేడాను గమనించాలని ఓటర్లను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. శనివారం సిద్దిపేట జిల్లాలోని చేర్యాల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. 50 ఏళ్ల కాంగ్రెస్.. పదేళ్ల BRS పనితీరులో తేడా గమనించి నిర్ణయం తీసుకోవాలని ఆయన ఓటర్లకు విజ్ణప్తి చేశారు.
హైదరాబాదులో ఏడున్నర కోట్ల నగదు స్వాధీనం
హైదరాబాద్ లో ఏడున్నర కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బండ్లగూడ అప్పా జంక్షన్ వద్ద ఈ నగదు స్వాధీనం చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు. తనిఖీల్లో భాగంగా ఆరు కార్లలో ఈ డబ్బును తరలిస్తుండగా గుర్తించారు. ఈ డబ్బు ఖమ్మం జిల్లాకు చెందిన ఒక నేతకు సంబంధించినదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై భారతీయ జనతా పార్టీ నేత బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలపై స్పందిస్తూ.. కాంగ్రెస్‌కు ఆరు స్కీమ్‌లు.. అరడజను ముఖ్యమంత్రులంటూ ఎద్దేవా చేశారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కూడా విమర్శలు గుప్పించారు. బీజేపీని చూసి కేసీఆర్ కు భయం పట్టుకుందని బండి అన్నారు.
కొడుకును సీఎం చేసేందుకే నన్ను బయటికి పంపారు
కొడుకును (కేటీఆర్) ముఖ్యమంత్రి చేసేందుకే తనను కేసీఆర్ బయటకు పంపించారని భారతీయ జనతా పార్టీ నేత ఈటల రాజేందర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్, కేసీఆర్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం కోసం కేసీఆర్ ఏమైనా చేయగలరంటూ విమర్శలు గుప్పించారు… Read More
రాములమ్మ గరం..
బీజేపీలో కేసీఆర్ నాటిన మొక్క ఉంది అంటూ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో చేరిన మొదటిసారి నిర్వహించిన మీడియా సమావేశంలో విజయశాంతి ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అవినీతి చేస్తుంటే..రాష్ట్రాన్ని దోచేస్తుంటే BJP ఎందుకు చర్యలు తీసుకోలేదు..? అంటూ ప్రశ్నించారు. బీజేపీ అతి పెద్ద తప్పు చేసింది.. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు… Read More
ఆ క్రెడిట్ మాదే..
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కాంగ్రెస్ ఘనతే అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కరెంట్ ఇవ్వదు అంటూ BRS తప్పుడు ప్రచారం చేస్తోందని ఈ ప్రచారాలను నమ్మవద్దని ఉత్తమ్ సూచించారు… Read More
తగ్గేదేలే..
పలు పెండింగ్ బిల్లులను తమిళనాడు అసెంబ్లీ ఆమోదం పలికింది. ఆమోదం చెందిన బిల్లులను గవర్నర్‌కు మళ్లీ పంపిస్తామని స్పీకర్ అన్నారు.
అమెరికాలో కాల్పుల కలకలం ..
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. పలువురికి గాయాలయ్యాయి. స్థానిక పోలీసులు ఘటన స్థలికి చేరుకొని దుండగుడిని హతమార్చారు. Read More
విముక్తి ఎప్పుడు?
ఉత్తరాఖండ్ లో టన్నెల్ కూలిన ఘటనలో చిక్కుకున్న కార్మికులను కాపాడే కొనసాగిస్తున్న రెస్క్యూ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. డ్రిల్లింగ్ మిషన్ మొరాయించడంతో పనులు నిలిచిపోయాయి.
చంద్రయాన్-4కి ఇస్రో సన్నద్ధం!
చంద్రయాన్-3 విజయవంతమైన నేపథ్యంలో మరో రెండు లూనార్ మిషన్లకు సిద్ధమవుతోంది ఇస్రో. లూపెక్స్, చంద్రయాన్-4 ప్రాజెక్టుల ద్వారా 350 కేజీల ల్యాండర్‌ను చంద్రుడి 90 డిగ్రీల ప్రాంతంలో ల్యాండ్ చేయడానికి, శాంపిల్ రిటర్న్ మిషన్ ప్రయోగానికి పనిచేస్తున్నామని అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ వెల్లడించారు. పుణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రయాన్-4లో చంద్రుడిపై దిగిన తర్వాత అక్కడి ఉపరితలం నుంచి శాంపిల్ తీసుకొని వెనక్కు వచ్చే అవకాశం ఉందన్నారు. వచ్చే ఐదారేళ్లలో ఈ ప్రతిష్టాత్మక మిషన్‌ను చేపడతామని తెలిపారు.
గెలుపే లక్ష్యం ..
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో భాగంగా రేపు (ఆదివారం) భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ లో విశ్వవిజేతగా నిలిచేందుకు రెండు జట్ల ఆటగాళ్లు కసరత్తు చేస్తున్నారు. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రేపు మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభమవుతుంది.